For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లోనే: విప్రోకు మరో డీల్: ఐటీ స్టాక్స్ జూమ్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 20) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 56.66 పాయింట్లు(0.14%) నష్టపోయి 40,374.94, నిఫ్టీ 18.80 పాయింట్లు(0.16%) నష్టపోయి 11,854.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం గం.12.36 సమయానికి సెన్సెక్స్ 270 పాయింట్లు ఎగిసి 40,701 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. కాసేపటికి లాభాలు క్షీణించాయి. ఉదయం 340 షేర్లు లాభాల్లో, 432 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 54 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

మధ్యాహ్నం గం.12.38 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, లార్సన్, టీసీఎస్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, ఓఎన్జీసీ, ఐవోసీ, హిండాల్కో, కోల్ ఇండియా ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, లార్సన్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

ఏసీసీ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఉదయం స్టాక్స్ భారీగా ఎగిశాయి. ఓ సమయంలో స్టాక్ రూ.1,618ని తాకింది. ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో స్టాక్స్ మధ్యాహ్నం సమయానికి రూ.1573కు దిగి వచ్చింది.

డాలర్ మారకంతో రూపాయి ఫ్లాట్‌గా 73.36 వద్ద ప్రారంభమైంది. నిన్నటి సెషన్‌లో 73.36 వద్ద క్లోజ్ అయింది.

గ్రాన్యువల్స్ ఇండియా రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన 71 శాతం లాభాలు నమోదు చేసింది.

ఈ స్టాక్స్ డౌన్

ఈ స్టాక్స్ డౌన్

వొడాఫోన్ ఐడియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంకు, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఐసీఐసీ బ్యాంకు లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐటీసీ, ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

బ్రిటానియా ఈ త్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేసినప్పటికీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నుండి ఏ దేశలోను లాభాల్లోకి రాలేదు.

ఈ రోజు ఐటీ ఇండెక్స్ 1 శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు 1 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

విప్రోకు మరో డీల్

విప్రోకు మరో డీల్

దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో మరో డీల్ కుదుర్చుకుంది. క్లీన్ ఎనర్జీ కంపెనీ ఫోర్టమ్‌తో ఐదేళ్ల కాలానికి డీల్ కుదుర్చుకుంది. దీంతో విప్రో స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ కూడా కొనసాగుతోంది.

ఐటీ స్టాక్స్ అన్నీ ఈ రోజు లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్ 1.49 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.16 శాతం, ఇన్ఫోసిస్ 1.12 శాతం, టెక్ మహీంద్ర 2.99 శాతం, విప్రో 1.17 శాతం, మైండ్ ట్రీ రూ.3.37 శాతం, కోఫోర్జ్ 1.96 శాతం పెరిగింది.

నిఫ్టీ బ్యాంకు నష్టాల్లో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ ఐటీ 1 శాతానికి పైగా లాభపడింది.

English summary

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లోనే: విప్రోకు మరో డీల్: ఐటీ స్టాక్స్ జూమ్ | Sensex, Nifty near day's high: HCL Tech top gainers

Among sectors, IT index rose 1 percent, while PSU Bank index fell 1 percent. L&T, HCL Tech, HDFC Bank, Bharti Airtel and Tech Mahindra were among major gainers on the Nifty.
Story first published: Tuesday, October 20, 2020, 13:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X