For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊగిసలాటలో మార్కెట్లు: ఆ 2 స్టాక్స్ అదుర్స్, అమ్మేవాళ్లు కూడా లేరు...

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(సెప్టెంబర్ 30) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 27.21 పాయింట్లు(0.07%) క్షీణించి 37,946.01 వద్ద, నిఫ్టీ 10.30 పాయింట్లు(0.09%) లాభపడి 11,212.10 వద్ద ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. 490 షేర్లు లాభాల్లో, 353 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 73.82 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు రోజు 73.82 వద్దనే క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు దూసుకెళ్తున్నాయి.

అదానీలో అప్పుడు రూ.1 పెడితే ఇప్పుడు రూ.800 వచ్చాయి, రెండో స్థానంలోకి భారత్అదానీలో అప్పుడు రూ.1 పెడితే ఇప్పుడు రూ.800 వచ్చాయి, రెండో స్థానంలోకి భారత్

మెటల్ ఇండెక్స్ డౌన్

మెటల్ ఇండెక్స్ డౌన్

- బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 2 శాతం మేర క్షీణించింది. హిందూస్తాన్ జింక్ మాత్రమే స్వల్ప లాభాల్లో (0.07 శాతం) ఉంది. కోల్ ఇండియా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిండాల్కో, ఎన్ఎండీసీ, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.64 శాతం నుండి 1.53 శాతం మేర నష్టపోయాయి.

- ఫార్మా సూచీ 1 శాతం మేర లాభపడింది. మెటల్ సూచీ 2 శాతం మేర క్షీణించింది. ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్ సెక్టార్ కూడా నష్టాల్లో కనిపించింది.

- జనరల్ అట్లాంటింక్ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1 శాతం మేర పెరిగింది.

- మధ్యాహ్నం గం.1 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, సిప్లా, నెస్ట్లే, టైటాన్ కంపెనీ ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.

ఐటీ స్టాక్స్ మిశ్రమంగా..

ఐటీ స్టాక్స్ మిశ్రమంగా..

- ఐటీ స్టాక్స్ ఈ రోజు మిశ్రమంగా ఉన్నాయి. టెక్ మహీంద్రా 1 శాతం, ఇన్ఫోసిస్ 0.31 శాతం, టీసీఎస్ షేర్ ధర 0.27 శాతం, విప్రో షేర్ 0.75 శాతం లాభపడ్డాయి. అయితే హెచ్‌సీఎల్ టెక్ 0.86 శాతం, కోఫోర్జీ షేర్ ధర 1.27 శాతం మేర నష్టపోయాయి.

- టెక్ మహీంద్రా బై-ఫెయిర్ వ్యూల్యూ రూ.845గా కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది.

- బీఎస్ఈ మిడ్ క్యాప్ షేర్లు 0.3 శాతం లాభాల్లో ఉన్నాయి. అదానీ గ్రీన్, టోరెంట్ ఫార్మా వంటివి లాభాల్లో ఉండగా, బీహెచ్ఈఎల్ వంటివి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

- ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 0.7 శాతం మేర లాభపడ్డాయి. యూకేకు చెందిన ఓక్‌నార్త్ హోల్డింగ్స్‌కు వాటాలు విక్రయించేందుకు మొగ్గు చూపుతోంది. దీంతో స్టాక్స్ పుంజుకున్నాయి.

- మణప్పురం ఫైనాన్స్ 0.6 శాతం మే పెరిగింది.

ఈ రెండు స్టాక్స్ అదురుస్

ఈ రెండు స్టాక్స్ అదురుస్

- వెల్‌స్పన్ కార్ప్ స్టాక్స్ 5 శాతం మేర లాభపడ్డాయి. ఇటీవల ఈ కంపెనీ రూ.1400 కోట్ల విలువైన ఆర్డర్స్ దక్కించుకుంది. దీంతో మొత్తం వ్యాల్యూ రూ.6300 కోట్లకు చేరుకుంది.

- ఇటీవల వివిధ కంపెనీలు దేశ, విదేశాల నుండి భారీగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. దీంతో స్టాక్స్ వ్యాల్యూ పెరుగుతోంది.

- రెండు వారాల పాటు పతనమై, నిన్న ఎగిసిన ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. ఈ రెండు కౌంటర్లు కొనుగోళ్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ స్టాక్స్ అమ్మేవాళ్లు కనిపించడం లేదు.

English summary

ఊగిసలాటలో మార్కెట్లు: ఆ 2 స్టాక్స్ అదుర్స్, అమ్మేవాళ్లు కూడా లేరు... | Sensex, Nifty gain led by FMCG, pharma stocks

Among sectors, pharma Index rose over 1 percent, while metal index shed nearly 2 percent followed by the auto, energy and bank.
Story first published: Wednesday, September 30, 2020, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X