For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడో రోజు డౌన్: భారీ నష్టాల నుండి 372 పాయింట్లు అప్.. ఇన్ఫోసిస్, ఆటో, బ్యాంకింగ్ దెబ్బ

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శక్రవారం (అక్టోబర్ 30) నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత లాభాల దిశగా కనిపించాయి. చివరలో అమ్మకాల ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం వంటి వివిధ కారణాలతో వరుసగా మూడో రోజు నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 135.78 పాయింట్లు(0.34%) క్షీణించి 39,614.07 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28.40 పాయింట్లు (0.24%) పడిపోయి 11,642.40 పాయింట్ల వద్ద ముగిసింది.

1,322 షేర్లు లాభాల్లో, 1222 షేర్లు నష్టాల్లో ముగియగా, 167 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో, ఇతర రంగాలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.6 శాతం మేర, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది.

ఆపిల్‌కు ఐఫోన్ గట్టి దెబ్బ, గంటల్లో రూ.7.4 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి!ఆపిల్‌కు ఐఫోన్ గట్టి దెబ్బ, గంటల్లో రూ.7.4 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి!

భారీ నష్టాల నుండి కాస్త కుదురుకొని...

భారీ నష్టాల నుండి కాస్త కుదురుకొని...

స్టాక్ మార్కెట్లు ఉదయం ప్రారంభంలో నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. కానీ మధ్యాహ్నం సమయానికి తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. నేడు సెన్సెక్స్ 39,988 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా, 39,242 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డే హై నుండి 700 పాయింట్ల మేర పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ నష్టాల నుండి కొలుకొని 39,614 వద్ద ముగిసింది. నేటి కనిష్టం నుండి 372 పాయింట్లు కోలుకొని, భారీ నష్టాలను తప్పించింది.

నెల క్రితం కనిష్టానికి

నెల క్రితం కనిష్టానికి

నవంబర్ సిరీస్ మార్కెట్లో నష్టాల్లో ప్రారంభమవుతున్నాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు నెల క్రితం కనిష్టానికి చేరుకున్నాయి.

నిఫ్టీ 11,700 దిగువకు పడిపోయింది. నిఫ్టీ బ్యాంకు 24,000 దిగువన ముగిసింది.

మిడ్ క్యాప్ సూచీలు ఈ రోజు మంచి లాభాలు నమోదు చేశాయి.

నిఫ్టీ బ్యాంకు 191 పాయింట్లు కోల్పోయి 23,901 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ సూచీ 93 పాయింట్లు క్షీణించి 17,067 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ వారం రూ.2.6 లక్షల కోట్లు హరించుకుపోయింది.

నిఫ్టీ లూజర్‌లలో ఎయిర్‌టెల్ టాప్‌లో ఉంది.

అక్టోబర్ సేల్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఆటో స్టాక్స్ క్షీణించాయి.

ఐసీఐసీఐ బ్యాంకు దాదాపు రెండు శాతం నష్టపోయింది.

బీబీసీఎల్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు అంచనాలు మించడంతో ఈ స్టాక్స్ దాదాపు 4 శాతం లాభపడ్డాయి.

బ్లూడార్ట్ స్టాక్స్ ఏకంగా 14 శాతం ఎగిశాయి.

ఐటీ స్టాక్స్ జూమ్

ఐటీ స్టాక్స్ జూమ్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, సన్ ఫార్మా ఉన్నాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, ఐచర్ మోటార్స్, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

నిఫ్టీ బ్యాంకు 0.79 శాతం, నిఫ్టీ ఆటో 1.13 శాతం, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ 0.64 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.30 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.90 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ ఐటీ స్వల్పంగా 0.19 శాతం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ మీడియా 1.47 శాతం, నిఫ్టీ మెటల్ 1.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.15 శాతం లాభపడ్డాయి.

ప్రధానంగా ఆటో, పైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్‌ను కిందకు లాగాయి.

టీసీఎస్ స్టాక్ 1.17 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.56 శాతం, టెక్ మహీంద్ర 0.86 శాతం, విప్రో 1.05 శాతం, మైండ్ ట్రీ 0.86 శాతం, కోఫోర్జ్ స్టాక్ 0.59 శాతం ఎగిసింది. ఐటీ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్ మాత్రం 1.34 శాతం మేర నష్టపోయింది.

నష్టాలకు కారణాలు

నష్టాలకు కారణాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల పాటు నష్టాలను నమోదు చేశాయి. ఐరోపా సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి సమయం పడుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.

ఇటీవల బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఎగిశాయి. ఇటీవల అమ్మకాలు వెల్లువెత్తాయి.

English summary

మూడో రోజు డౌన్: భారీ నష్టాల నుండి 372 పాయింట్లు అప్.. ఇన్ఫోసిస్, ఆటో, బ్యాంకింగ్ దెబ్బ | Sensex, Nifty extend losses into third consecutive session: Reasons behind the fall

At close, the Sensex was down 135.78 points or 0.34% at 39614.07, and the Nifty was down 28.40 points or 0.24% at 11642.40. About 1322 shares have advanced, 1222 shares declined, and 167 shares are unchanged.
Story first published: Friday, October 30, 2020, 17:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X