For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో ప్రారంభమై.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: ఫార్మా, బ్యాంకు లాస్

|

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 100కు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయింది. చివరకు సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో 38,310 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 11,300 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 78.84 వద్ద ముగిసింది.

మార్కెట్ ముగింపు సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, హిండాల్కో, లార్సన్, టైటాన్ కంపెనీ, భారతీ ఇన్ఫ్రాటెల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఉన్నాయి. బ్యాంకు, ఫార్మా షేర్లు మినహా ఇతర రంగాల షేర్లు అన్నీ లాభాల్లో ముగిశాయి.

తీవ్ర ఆర్థికమాంద్యంలోకి బ్రిటన్, మరిన్ని ఇబ్బందులు కానీ.. రిషి సునక్ ఏమన్నారంటే?తీవ్ర ఆర్థికమాంద్యంలోకి బ్రిటన్, మరిన్ని ఇబ్బందులు కానీ.. రిషి సునక్ ఏమన్నారంటే?

Sensex, Nifty end lower due to pharma, bank stocks

బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 1.6 శాతం, 0.7 శాతం ఎగిశాయి. నిఫ్టీ బ్యాంకు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ ఫార్మా వరుసగా మూడో రోజు నష్టపోయింది. నగదు విభాగంలో బుధవారం FPIలు రూ.351 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్(DII) రూ.940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మంగళవారం FPIలు రూ.1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, DII రూ.1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి.

English summary

లాభాల్లో ప్రారంభమై.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: ఫార్మా, బ్యాంకు లాస్ | Sensex, Nifty end lower due to pharma, bank stocks

On the sectoral front, except bank and pharma other indices ended in the green, while BSE Midcap and Smallcap indices rose 1.6 percent and 0.7 percent respectively.
Story first published: Thursday, August 13, 2020, 20:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X