For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 689 పాయింట్లు జంప్: రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ దూకుడు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 8) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. నిఫ్టీ 14,367.30 పాయింట్లను, సెన్సెక్స్ 48,854.34 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను తాకింది. బీఎస్ఈ మిడ్ క్యూప్ 19,161.20 వద్ద రికార్డుకు చేరుకుంది. స్మాల్ క్యాప్ సూచీ ఇంట్రాడేలో 18,984.69ను తాకింది. స్మాల్ క్యాప్ సూచీ 1200 పాయింట్లకు పైన ఉంది.

ఆల్ టైమ్ కంటే దిగువనే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర నేడు 1.20 శాతం లాభపడి రూ.1934 వద్ద క్లోజ్ అయింది. ఇప్పటికీ రూ.1950 కంటే దిగువనే ఉంది. ఇన్ఫోసిస్ స్టాక్ దాదాపు 4 శాతం లాభపడి 1,311 వద్ద ముగిసింది. టీసీఎస్ దాదాపు మూడు శాతం లాభపడి 3122 వద్ద క్లోజ్ అయింది. ఐటీ, ఆటో స్టాక్స్ భారీగా జంప్ చేశాయి.

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువవేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ

సూచీలు జంప్

సూచీలు జంప్

నేడు సెన్సెక్స్ 689 పాయింట్లు(1.43 శాతం) పెరిగి 48,782.51 పాయింట్ల వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు(1.48 శాతం) లాభపడి 14,347.25 వద్ద క్లోజ్ అయింది.

ఏషియన్ పేయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్ తదితర 460 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

జమ్ము కాశ్మీర్ బ్యాంకు, బోరోసిల్ రెన్యూవబుల్స్, మెజెస్కో, ఉజాస్ ఎనర్జీ, గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ వంటి 50 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా 3 శాతం చొప్పున ఎగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 5.93 శాతం, విప్రో 5.77 శాతం, టెక్ మహీంద్రా 5.66 శాతం, యూపీఎల్ 4.38 శాతం, ఐచర్ మోటార్స్ 4.19 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 1.72 శాతం, టాటా స్టీల్ 1.34 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.29 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.92 శాతం, ఐటీసీ 0.64 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, మారుతీ సుజుకీ, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 1.48 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.09 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా నిఫ్టీ ఆటో 3.30 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.40 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.25 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.72 శాతం, నిఫ్టీ ఐటీ 3.61 శాతం, నిఫ్టీ మీడియా 3.26 శాతం, నిఫ్టీ ఫార్మా 1.61 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.42 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.44 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ మెటల్ 0.60 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.45 శాతం నష్టపోయాయి.

English summary

సెన్సెక్స్ 689 పాయింట్లు జంప్: రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ దూకుడు | Sensex, Nifty end at record closing highs; IT, auto steal the show

Nifty IT, Auto and Media indices jumped more than 3 percent each. Nifty Metal, PSU bank indices closed in the red.
Story first published: Friday, January 8, 2021, 17:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X