For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్, మార్కెట్ దూకుడుకు కారణాలివే..

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 1) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కిందకు రాలేదు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్ స్టాక్ జంప్ చేశాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 3 శాతం మేర లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. బ్యాంక్ నిఫ్టీ 29,817 వద్ద ముగిసింది.

నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్

సెన్సెక్స్ 505 పాయింట్లు జంప్

సెన్సెక్స్ 505 పాయింట్లు జంప్

సెన్సెక్స్ 505.72 పాయింట్లు(1.15%) లాభపడి 44,655.44 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు(1.08%) ఎగిసి 13,109 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1869 షేర్లు లాభాల్లో, 974 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

నిఫ్టీ 50 స్టాక్స్ 1.08 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.59 శాతం లభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.07 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.71 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.38 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 1.87 శాతం, నిఫ్టీ మీడియా 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 1.65 శాతం, నిఫ్టీ ఫార్మా 1.74 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.88 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోయింది.

ఐటీ స్టాక్స్ జంప్

ఐటీ స్టాక్స్ జంప్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 7.84 శాతం, సన్ ఫార్మా 5.41 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.41 శాతం, ఓఎన్జీసీ 3.89 శాతం, యూపీఎల్ 3.67 శాతం లాభాల్లో ముగిశాయి.నెస్ట్లే 2.63 శాతం, కొటక్ మహీంద్రా 1.64 శాతం, టైటాన్ కంపెనీ 1.48 శాతం, ఎన్టీపీసీ 1.00 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం నష్టాల్లో ముగిశాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర, సన్ ఫార్మా ఉన్నాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1.84 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.57 శాతం, ఇన్ఫోసిస్ 3.37 శాతం, టెక్ మహీంద్రా 3.79 శాతం, విప్రో 0.91 శాతం, కోఫోర్జ్ 2.11 శాతం లాభపడ్డాయి. మైండ్ ట్రీ స్టాక్ 0.46 శాతం న్టపోయింది.రిలయన్స్ స్టాక్ నేడు 1.26 శాతం లాభపడి రూ.1954 వద్ద క్లోజ్ అయింది.

అందుకే మార్కెట్లు జంప్

అందుకే మార్కెట్లు జంప్

ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే దేశీయ మార్కెట్లోకి రికార్డు స్థాయిలో FIIలు తీసుకు రావడంతో మార్కెట్ ర్యాలీ చేసింది. భవిష్యత్తులో పెట్టుబడుల రాక తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నవంబర్ నెలలో రూ,60,300 కోట్ల FIIలు వచ్చాయి. డిసెంబర్‌లో సెలవుల సీజన్ కావడంతో FII సొమ్ము తగ్గవచ్చు. వ్యాక్సీన్ ఈ నెలలోనే రానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి బ్లూచిప్ స్టాక్స్ ర్యాలీ చేశాయి.

English summary

సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్, మార్కెట్ దూకుడుకు కారణాలివే.. | Sensex jumps 505 points, Nifty ends above 13,100 On Economic Recovery Signs

Domestic stock markets registered sharp gains on Tuesday as data showing a smaller-than-expected contraction in the economy and broader optimism stemming from hopes for a COVID-19 vaccine boosted investor sentiment.
Story first published: Tuesday, December 1, 2020, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X