For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదే దూకుడు: సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, రూ.100 లక్షల కోట్లకు నిఫ్టీ ఎం-క్యాప్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (నవంబర్ 11) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా ఎనిమిదో రోజు మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 173.17 పాయింట్లు (0.40%) లాభపడి 43,450.82 వద్ద, నిఫ్టీ 55.30 పాయింట్లు(0.44%) లాభపడి 12,686.40 వద్ద ప్రారంభమైంది.

701 షేర్లు లాభాల్లో, 301 స్టాక్స్ నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలలో ఎలాంటి మార్పులేదు. గత ఎనిమిది సెషన్లుగా లాభాల్లో ఉన్న సెన్సెక్స్, ఈ వారంలో మొదటి రెండు రోజుల్లో 1400 పాయింట్ల మేర లాభపడింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 74.23 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 74.17 వద్ద ముగిసింది.

TataMD CHECK: టాటా కరోనా టెస్ట్ కిట్, 90 నిమిషాల్లోనే ఫలితంTataMD CHECK: టాటా కరోనా టెస్ట్ కిట్, 90 నిమిషాల్లోనే ఫలితం

జీవనకాల గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ

జీవనకాల గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ

భారత మార్కెట్లు లాభాల్లో ఉండగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 292.06 (0.67%) పాయింట్లు లాభపడి 43,569.71 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభంలో ఓ సమయంలో 43,666 పాయింట్లకు చేరుకుంది. తద్వారా జీవనకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 103.65 (0.82%) పాయింట్లు ఎగిసి 12,734.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 12,762 పాయింట్లను తాకింది.

నిఫ్టీ-50 మార్కెట్ క్యాప్ రూ.100 లక్షల కోట్లను దాటింది.

ఆసియా మార్కెట్ విషయానికి వస్తే నిక్కీ 1.24 శాతం, కోస్పి 0.87 శాతం, సెట్ కాంపోజిట్ 4.31 శాతం, జకర్తా కాంపోజిట్ 1.99 శాతం లాభాల్లో ఉండగా స్ట్రెయిట్ టైమ్స్ 0.79 శాతం, హాంగ్‌షెంగ్ 0.02 శాతం, షాంఘై కాంపోజిట్ 0.07 శాతం నష్టాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 3.81 శాతం, సిప్లా 3.26 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.27 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.73 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.62 శాతం లాభంతో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.57 శాతం, హెచ్‌యూఎల్ 1.17 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.08 శాతం, బ్రిటానియా 0.95 శాతం, టైటాన్ కంపెనీ 0.87 శాతం నష్టాల్లో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, కొటక్ మహీంద్ర బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.61 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.07 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.02 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.36 శాతం, నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.93 శాతం, నిఫ్టీ మెటల్ 1.15 శాతం, నిఫ్టీ ఫార్మా 2.32 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.50 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.21 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.82 శాతం లాభాల్లో ఉన్నాయి. కేవలం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.07 శాతం నష్టాల్లో ఉంది.

నిన్న భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్ నేడు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ 0.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.72 శాతం, ఇన్ఫోసిస్ 0.96 శాతం, టెక్ మహీంద్ర 0.91 శాతం, విప్రో 0.70 శాతం, మైండ్ ట్రీ 0.38 శాతం, కోఫోర్జ్ 0.94 శాతం లాభపడ్డాయి.

English summary

అదే దూకుడు: సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, రూ.100 లక్షల కోట్లకు నిఫ్టీ ఎం-క్యాప్ | Sensex gains 350 points, Nifty market cap crosses Rs 100 lakh crore

All the sectoral indices are trading in the green led by the auto, bank, pharma and energy. Indian rupee opened lower at 74.23 per dollar on Wednesday against previous close of 74.17, amid buying seen in the domestic equity market.
Story first published: Wednesday, November 11, 2020, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X