For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల నుండి స్వల్ప లాభాల్లోకి మార్కెట్లు, కారణాలివే..: లాభాలు తగ్గినా ఈ స్టాక్ జంప్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 13) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభపడిన మార్కెట్లు, నిన్న నష్టాల్లో ముగిశాయి. రెండో రోజు కూడా నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 257.28 పాయింట్లు(0.59%) నష్టపోయి 43,099.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69.40 పాయింట్లు(0.55%) కోల్పోయి 12,621.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

ఓ సమయంలో 200 పాయింట్ల మేర నష్టపోయిన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.10.42 సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభపడింది.
565 షేర్లు లాభాల్లో, 479 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 63 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్‌న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్‌న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...

రిలయన్స్ జంప్, ఐచర్ మోటార్స్ నిరాశపరిచినా స్టాక్ అదుర్స్

రిలయన్స్ జంప్, ఐచర్ మోటార్స్ నిరాశపరిచినా స్టాక్ అదుర్స్

ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో... ఐచర్ మోటార్స్ 4.98 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.93 శాతం, రిలయన్స్ 2.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.36 శాతం, హీరో మోటో కార్ప్ 1.35 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో... టాటా మోటార్స్ 2.31 శాతం, లార్సన్ 2.20 శాతం, ఐవోసీ 1.41 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.27 శాతం ఉన్నాయ.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు భారీగా లాభపడి రూ.2000 మార్కును దాటింది. రిలయన్స్ టాప్ గెయినర్‌గా ఉంది. రిలయన్స్ స్టాక్ ధర 2.50 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ, రూ.2000కు పైనే ఉంది.

ఐచర్ మోటార్స్ టార్గెట్ ధరను రూ.3025గా ఎంకే గ్లోబల్ పేర్కొంది. త్రైమాసిక ఫలితాల ప్రకారం లాభాలు 40 శాతం క్షీణించాయి. అయినప్పటికీ స్టాక్ నేడు 52 వారాల గరిష్టాన్ని తాకింది. దాదాపు 5 శాతం మేర లాభపడి రూ.2,464 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ స్టాక్స్ డౌన్

ఐటీ స్టాక్స్ డౌన్

రంగాలవారీగా చూస్తే నిఫ్టీఆటో 0.32 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.91శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 0.84 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.90 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 0.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.38 శాతం, నిఫ్టీ ఐటీ 0.38 శాతం, నిఫ్టీ మీడియా 1.51 శాతం, నిఫ్టీ మెటల్ 0.30 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.71 శాతం నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1 శాతం,టెక్ మహీంద్ర 0.91 శాతం, విప్రో 0.59 శాతం, మైండ్ ట్రీ 0.78 శాతం, కోఫోర్జ్ 1.04 శాతం నష్టపోయాయి. హెచ్‌సీఎల్ టెక్ 0.19 శాతం, ఇన్ఫోసిస్ 0.38 శాతం శాతం లాభపడ్డాయి.

పడిలేచిన మార్కెట్లు

పడిలేచిన మార్కెట్లు

అమెరికా సహా ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు లాక్ డౌన్ ఆంక్షలు పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ, అమెరికా మార్కెట్లు పడిపోయాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. వీటికి బ్యాంకింగ్, మెటల్ రంగాల భారీ నష్టాలు తోడవడంతో కుప్పకూలాయి. అయితే ఆ తర్వాత కోలుకున్నాయి.

English summary

భారీ నష్టాల నుండి స్వల్ప లాభాల్లోకి మార్కెట్లు, కారణాలివే..: లాభాలు తగ్గినా ఈ స్టాక్ జంప్ | Sensex falls over 200 points, Nifty below 12,650 on weak global cues

Nifty Bank index shed over 1 percent, while Metal and IT indices trading lower. IndusInd Bank, Tata Motors, L&T, BPCL and SBI were among the top losers on the Nifty.
Story first published: Friday, November 13, 2020, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X