ముంబై: స్టాక్ మార్కెట్లు ఈరోజు (సెప్టెంబర్ 14, సోమవారం) భారీ లాభాల్లో ప్రారంభమై, దాదాపు చివరి వరకు ఆదే విధంగా కొనసాగి, చివర్లో అమ్మకాల ఒత్తిడితో దాదాపు వంద పాయింట్ల నష్టంతో ముగిశాయి. చివరి గంటన్నర సమయంలో అమ్మకాలు ఊపందుకొని, సూచిలను దెబ్బకొట్టాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 38,756.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టపోయి 11,440.05 వద్ద ముగిసింది.
ఐటీ రంగం షేర్లు భారీగా ఎగిశాయి. అలాగే రియాల్టీ షేర్లు, ఇండస్ట్రియల్, టెక్ షేర్లు సూచీలు పైకి ఎగరడానికి కారణమయ్యాయి. అయితే బీఎస్ఈ టెలికాం, బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఎనర్జీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 98 డౌన్, నేటి గరిష్టం 745 పాయింట్లు డౌన్
ఉదయం సెన్సెక్స్ ఓ సమయంలో 300 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రారంభంలోనే 290 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆ తర్వాత 400 దిశగా కనిపించింది. అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు లాభాల్లోనే ఉన్న మార్కెట్లు, ఆ తర్వాత చివరి గంటన్నరలో అమ్మకాలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో నేటి గరిష్టం నుండి సెన్సెక్స్ ఏకంగా 475 పాయింట్లు నష్టపోయి 38.756.63 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌తో 98 పాయింట్ల నష్టంతో ముగిసినా, డే-హై 475 పాయింట్లు క్షీణించింది.

ఐటీ, రియాల్టీ అదుర్స్
- ప్రభుత్వం 3.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌క్రాఫ్ట్ డెబిట్స్‌ను గ్రహిస్తుందని వార్తలు రావడంతో ఎయిర్ లైన్స్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
- నిఫ్టీ స్మాల్ క్యాప్ దాదాపు 6 శాతం ఎగిశాయి. సెబీ మల్టీ క్యాప్ ఫండ్స్ నిబంధనలు సెబి మార్చడంతో నిఫ్టీ స్మాల్ క్యాప్ భారీ లాభాల్లో ముగిశాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం మేర నష్టపోయింది. సాఫ్ట్‌బ్యాంకు, కార్లైల్ పెట్టుబడులు హోల్డ్‌లో ఉంచడంతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని షేర్లు నష్టాల్లో ముగిశాయి.
- HCL టెక్ ఏకంగా 10 శాతం లాభపడింది. ఈ ఐటీ సంస్థ క్యూ2 గైడ్ లైన్స్ సవరించడంతో లాభాలు చవిచూశాయి.
- హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
- టాటా మోటార్స్ 3 శాతం ఎగిశాయి.
- నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 4.4 శాతం ఎగిశాయి.
- నిఫ్టీ స్మాల్ క్యాప్ 5.6 శాతం, నిఫ్టీ ఐటీ 4.4 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.7 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.6 శాతం, నిఫ్టీ మీడియా 1.5 శాతం, నిఫ్టీ ఆటో 0.8 శాతం లాభపడ్డాయి.
- నిఫ్టీ మెటల్ 0.1 శాతం, నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు 0.6 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.8 శాతం, నిఫ్టీ ఫార్మా 0.8 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.8 శాతం నష్టపోయాయి.

వెనక్కి లాగిన రిలయన్స్, HDFC
- రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలుత 2.5 శాతం మేర లాభపడింది. అయితే ఆ తర్వాత పెట్టుబడులు హోల్డ్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో చివరకు 1 శాతం మేర నష్టపోయాయి.
- ఎన్ఎస్ఈలో 1,276 షేర్లు లాభాల్లో, 543 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
- ఐటీ, రియాల్టీ రంగాలతో సూచీలు భారీ లాభాల్లోకి రాగా, HDFC బ్యాంకు, HDFC, ఐసీఐసీఐ, రిలయన్స్ వంటి షేర్లు సెన్సెక్స్‌ను వెనక్కి లాగాయి.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications