For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 807 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్: 7 వారాల కనిష్టానికి రూపాయి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమై, అంతే భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం గం.12.13 సమయానికి సెన్సెక్స్ 363.19 (0.88%) పాయింట్లు దిగజారి 40,806.93 వద్ద, నిఫ్టీ 115.80 (0.96%) పాయింట్లు పడిపోయి 11,965.05 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 12,000 దిగువన, సెన్సెక్స్ 40వేల మార్క్‌కు పడిపోవడం గమనార్హం. సాయంత్రానికి మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ ఏకంగా 807 పాయింట్లు నష్టపోయి 40,363, నిఫ్టీ 251 పాయింట్లg కోల్పోయి 11,829 వద్ద ముగిసింది. ఐటీ షేర్లు మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనా వెలుపల కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.

Sensex falls 300 points, IT stocks gain strength as rupee hits 7 week low

ఉదయం మార్కెట్..

మధ్యాహ్నం సమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నెస్ట్లే, బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, కొటక్ బ్యాంకు, పవర్ గ్రిట్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టైటాన్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫిన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ నష్టాలను చవిచూశాయి.

ప్రపంచంలోనే ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ నెంబర్ వన్! కారణాలివే..ప్రపంచంలోనే ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ నెంబర్ వన్! కారణాలివే..

రూపాయి ఏడు వారాల కనిష్టానికి పడిపోవడంతో ఐటీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్, టాటా ఎల్క్సీ, టెక్ మహీంద్రా షేర్లు 1 శాతం నుండి 1.5 శాతం వరకు లాభపడ్డాయి. ఆ తర్వాత టీసీఎస్ 0.42 శాతం, విప్రో 0.2 శాతం లాభపడ్డాయి.

సోమవారం ఉదయం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం 24 పైసలు క్షీణించి 71.89 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు రోజు 71.65 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు వారం 71.36 పైసల వద్ద క్లోజ్ కాగా, గత వారం 71.65 వద్ద క్లోజ్ అయింది. చైనా కరోనా వైరస్ భారత కరెన్సీని వెంటాడుతోంది. ఈ కారణంగా సోమవారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌లో క్షీణించింది.

ఆ తర్వాత కాసేపటికి ముడి చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు 30 పైసలు పడిపోయి 71.94కు చేరుకుంది. ముడి చమురు ఫ్యూచర్స్ 2.51 శాతం పడిపోయి బ్యారెల్‌కు 57.03 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ ఆర్థికవ్యవస్థలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనల నేపథ్యంలో ముడిచమురు ధరలు దాదాపు మూడు శాతం తగ్గాయి. కరోనా వైరస్ ప్రభావం బంగారం ధరలపై కూడా పడింది.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 807 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్: 7 వారాల కనిష్టానికి రూపాయి | Sensex falls 300 points, IT stocks gain strength as rupee hits 7 week low

Technology stocks gained strength even as benchmark indices lost ground on February 24, as the rupee continued to depreciate and hit seven-week low.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X