For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లోనే... ఒడిదుడుకులు, రికార్డును తాకి వెనక్కి: SBI అదరగొట్టింది

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఫిబ్రవరి 5) లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభ సెషన్లో 51,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్ దానిని నిలుపుకోలేకపోయింది. రోజంతా లాభాల్లోనే ఉన్నప్పటికీ, ఊగిసలాటలో కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రాఫిట్ బుకింగ్, పలు కంపెనీల డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే ఏ సమయంలోను నిన్నటి (50,614 పాయింట్లు) మార్కు దిగువకు మాత్రం రాలేదు. నిఫ్టీ ఒకటి రెండుసార్లు నిన్నటి 14,865 పాయింట్ల కంటే దిగువకు వచ్చినప్పటికీ వెంటనే పుంజుకుంది. ఓ సమయంలో 15,000 పాయింట్లను దాటింది. కానీ దీనిని నిలుపుకోలేకపోయింది.

LPG Cylinder Price Alert: కస్టమర్లకు సిలిండర్ ధర షాక్, రూ.25 పెంపుLPG Cylinder Price Alert: కస్టమర్లకు సిలిండర్ ధర షాక్, రూ.25 పెంపు

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్ 117.34 పాయింట్లు లేదా 0.23% లాభపడి 50,731.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28.60 పాయింట్లు లేదా 0.19% ఎగిసి 14,924.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1281 షేర్లు లాభాల్లో, 1637 షేర్లు నష్టాల్లో ముగియగా, 146 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆటో, ఇన్ఫ్రా, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 51,031.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,073.27 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,565.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు లాభపడి 72.92 వద్ద క్లోజ్ అయింది. 72.98 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. గురువారం 72.96 వద్ద ప్రారంభమైంది. నేటి సెషన్లో 72.79-72.99 మధ్య కదలాడింది.

SBI జంప్

SBI జంప్

బ్రోకరేజీ సంస్థలు SBI అంచనాలను, టార్గెట్‌ను పెంచడంతో ఈ స్టాక్ 11 శాతానికి పైగా ఎగిసింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ITC, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో SBI 11 శాతం, టాటా స్టీల్ 4.44 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.90 శాతం, కొటక్ మహీంద్రా 3.78 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.85 శాతం లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్ జాబితాలో 3.27 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.25 శాతం, టాటా మోటార్స్ 3.14 శాతం, ICICI బ్యాంకు 2.25 శాతం, UPL 2.11 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా

రంగాలవారీగా

నిఫ్టీ 50 స్టాక్స్ 0.19 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.75 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 0.88 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.71 శాతం, నిఫ్టీ ఐటీ 0.40 శాతం, నిఫ్టీ మెటల్ 0.99 శాతం, నిఫ్టీ ఫార్మా 1.66 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.60 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.68 శాతం లాభపడ్డాయి. ఇక, నిఫ్టీ ఆటో 1.32 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.27 శాతం, నిఫ్టీ మీడియా 4.47 శాతం,నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.69 శాతం నష్టపోయాయి.

English summary

లాభాల్లోనే... ఒడిదుడుకులు, రికార్డును తాకి వెనక్కి: SBI అదరగొట్టింది | Sensex fails to hold Mt 51K, ends 117 points higher, Nifty ends a tad below 15,000

Among sectors, Nifty PSU Bank index gained 3.6 percent, while pharma index up 1 percent each. However, selling seen in the auto, infra and IT stocks.
Story first published: Friday, February 5, 2021, 17:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X