For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్‌కు అమెజాన్ షాక్, కుప్పకూలిన మార్కెట్! సెన్సెక్స్ 540 పాయింట్లు డౌన్.. కారణాలివే..

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు(1.33%) పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద, నిఫ్టీ 162.60 పాయింట్లు(1.36%) దిగజారి 11,767.80 వద్ద క్లోజ్ అయింది. 986 షేర్లు లాభాల్లో, 1655 షేర్లు నష్టాల్లో ముగియగా, 171 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఓ సమయంలో 700 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ 40,000 మార్క్ దిగువకు వచ్చింది. ఆ తర్వాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ ఐదు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 11,800 దిగువకు వచ్చింది.

రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు షాక్: అమెజాన్‌కు తాత్కాలిక ఊరటరిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు షాక్: అమెజాన్‌కు తాత్కాలిక ఊరట

రిలయన్స్‌కు అమెజాన్ షాక్, కుప్పకూలిన మార్కెట్

రిలయన్స్‌కు అమెజాన్ షాక్, కుప్పకూలిన మార్కెట్

గత గురువారం స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు, అంతకుముందు గురువారం ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు 500 పాయింట్లు దిగజారింది. రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు నష్టపోవడం మార్కెట్‌కు నష్టాలు తెచ్చింది. ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సంబంధించి అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లగా ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్ తగిలింది. రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌ను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇది రిలయన్స్ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. రిలయన్స్ ఏకంగా 3.70 శాతం మేర నష్టపోయి రూ.2,034.90 వద్ద ముగిసింది.

ఆటో స్టాక్స్‌కు భారీ దెబ్బ

ఆటో స్టాక్స్‌కు భారీ దెబ్బ

సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పెరిగింది.

నిఫ్టీలో 39 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఆటో టాప్ లూజర్‌గా నిలిచింది.

మిడ్ క్యాప్ సూచీ, నిఫ్టీ బ్యాంకు భారీగా నష్టపోవడం మార్కెట్ పైన ప్రభావం చూపింది.

నిఫ్టీ బ్యాంకు 403 పాయింట్లు నష్టపోయి 24,075 పాయింట్లు, మిడ్ క్యాప్ సూచీ 296 పాయింట్లు నష్టపోయి 17,010 పాయింట్ల వద్ద ముగిసింది.

డిమాండ్ ఆశించిన మేర పుంజుకోలేదని ఆటో డీలర్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో టూ-వీలర్ స్టాక్స్ నష్టపోయాయి.

హీరో మోటో, బజాజ్ ఆటో ఒక్కోటి 6 శాతం చొప్పున, ఐచర్ 3 శాతం నష్టపోయింది.

కొటక్ మహీంద్రా బ్యాంకు మాత్రం 2 శాతం లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు స్టాక్స్ 1 శాతం ఎగిసింది.

ఎల్ అండ్ టీ 1 శాతం ఎగిసింది.

అన్ని స్టాక్స్ నష్టాల్లోనే..

అన్ని స్టాక్స్ నష్టాల్లోనే..

అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఒక్కొక్కటి మూడు శాతానికి పైగా, నిఫ్టీ మీడియా 2.74 శాతం నష్టపోయింది. నిఫ్టీ బ్యాంకు 1.65 శాతం, నిఫ్టీ ఆటో 3.22 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్ 1 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.03 శాతం, నిఫ్టీ ఐటీ 1.20 శాతం, నిఫ్టీ మీడియా 2.74 శాతం, నిఫ్టీ మెటల్ 3.50 శాతం, నిఫ్టీ ఫార్మా 1.47 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.41 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.89 శాతం నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ (0.12 శాతం) మాత్రమే లాభాల్లో ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్ (0.59 శాతం), ఇన్ఫోసిస్(0.74 శాతం), టెక్ మహీంద్ర (3.34 శాతం), విప్రో (0.88 శాతం), మైండ్ ట్రీ(0.88 శాతం), కోఫోర్జ్ (7.70 శాతం) నష్టపోయాయి.

నష్టాలకు కారణాలు

నష్టాలకు కారణాలు

సెన్సెక్స్ ప్రారంభంలోనే 150 పాయింట్లు కోల్పోయింది. ఏ దశలోను కోలుకోలేదు. అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఆసియా మార్కెట్లు మందకోడిగా ట్రేడ్ అయ్యాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఓ సమయంలో 700 పాయింట్లు నష్టపోయింది. గతవారం వచ్చిన లాభాలు అన్నీ ఈ రోజు ట్రేడింగ్‌లో ముగిశాయి. సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పు నేపథ్యంలో రిలయన్స్ షేర్లు పడిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఆశించిన దాని కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో మెటల్ స్టాక్స్ పడిపోయాయి.

అన్ని రంగాల్లోను అమ్మకాలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, కరోనా కేసులు పెరగడం వంటి కారణాలు దెబ్బతీశాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్, నెస్ట్లే, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హీరో మోటో కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

English summary

రిలయన్స్‌కు అమెజాన్ షాక్, కుప్పకూలిన మార్కెట్! సెన్సెక్స్ 540 పాయింట్లు డౌన్.. కారణాలివే.. | Sensex ends 540 points lower, Nifty below 11,800: Key factors dragging markets lower

All the sectoral indices ended in the red with Nifty Auto and Metal indices shed over 3 percent each. BSE Midcap and Smallcap indices fell 0.9-1.8 percent.
Story first published: Monday, October 26, 2020, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X