For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి: చాన్నాళ్లు రిలయన్స్ అదుర్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. ఉదయం భారీ నష్టాల్లో కనిపించిన సెన్సెక్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పుంజుకుంది. ఆ తర్వాత అంతకంతకూ ఎగిసింది. ఓ సమయంలో 49,569 పాయింట్లను క్రాస్ చేసి 49,600 దిశగా కనిపించింది. అయితే ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 49,517 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న 49,269 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు మధ్యాహ్నం 300 పాయింట్లు ఎగిసి సరికొత్త శిఖరాన్ని తాకింది. ఆటో, ఇన్ఫ్రా స్టాక్స్ లాభాలకు ప్రధాన కారణం. గత కొద్ది రోజులుగా అంతకంతకూ పడిపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడింది. నేడు ఏకంగా 3 శాతం ఎగబాకి రూ.1954 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో రూ.1900 దిగువన క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ కూడా అదరగొట్టాయి.

నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!

భారీ నష్టాల నుండి లాభాల్లోకి

భారీ నష్టాల నుండి లాభాల్లోకి

సెన్సెక్స్ 247.79 (0.50%) లాభపడి 49,517.11 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89.20 (0.62%) పాయింట్లు ఎగిసి 14,574 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ నేడు 49,079 వద్ద కనిష్టాన్ని తాకింది. నేటి కనిష్టం నుండి 440 పాయింట్ల లాభంతో ముగిసింది. 1647 షేర్లు లాభాల్లో, 1387 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 158 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు, ఆటో స్టాక్స్ అదరగొట్టాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా ఎగిసి 73.25 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.42 వద్ద ప్రారంభమైంది. నేటి సెషన్లో 73.24-73.47 మధ్య కదలాడింది. నిన్న 73.38 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 7.77 శాతం, గెయిల్ 4.20 శాతం, ఐచర్ మోటార్స్ 3.76 శాతం, SBI 3.54 శాతం, కోల్ ఇండియా 3.49 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 4.52 శాతం,టైటాన్ కంపెనీ 2.35 శాతం, HUL 2.19 శాతం, నెస్ట్లే 2.13 శాతం, సన్ ఫార్మా 1.83 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.54 శాతం, మిడ్ క్యాప్ 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.24 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.06 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.29 శాతం, నిఫ్టీ మెటల్ 0.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.68 శాతం, నిఫ్టీ మీడియా 1.38 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.97 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.76 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.48 శాతం శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.56 శాతం, నిఫ్టీ ఐటీ 0.17 శాతం, నిఫ్టీ ఫార్మా 1.25 శాతం నష్టపోయాయి.

English summary

భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి: చాన్నాళ్లు రిలయన్స్ అదుర్స్ | Sensex ends 247 pts higher, Nifty closes above 14,550

Auto along with the bank, infra indices added a percent each while the pharma sector was down 1 percent.
Story first published: Tuesday, January 12, 2021, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X