For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా సిప్లా జూమ్, రక్షణశాఖ నిర్ణయం.. ఎల్&టీ సహా ఈ షేర్లు దూసుకెళ్లాయి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్, 10) లాభాల్లో ముగిశాయి. పార్మా షేర్లు ఏకంగా 5 శాతం లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 141 పాయింట్లు(0.37 శాతం) లాభపడి 38,182 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 11,270 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమై, చివరకు అదే దూకుడులో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.

ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి.. ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండొచ్చు?ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి.. ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండొచ్చు?

స్వల్పంగా పుంజుకున్న రూపాయి

స్వల్పంగా పుంజుకున్న రూపాయి

సిప్లా, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. పార్మా రంగం భారీ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 74.90 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం 74.93 వద్ద క్లోజ్ అయిన రూపాయి ఈ రోజు ఉదయం 74.95 వద్ద ప్రారంభమైంది. 75.85 నుండి 74.96 మధ్య ట్రేడ్ అయింది.

సిప్లా హవా.. ఎల్ అండ్ టీకీ రక్షణశాఖ నిర్ణయం ఊతం

సిప్లా హవా.. ఎల్ అండ్ టీకీ రక్షణశాఖ నిర్ణయం ఊతం

నిఫ్టీ బ్యాంక్ వరుసగా ఆరో సెషన్‌లో లాభపడింది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఐదు నెలల గరిష్టం 16,362కు చేరుకుంది. ఈ రోజు మార్కెట్‌లో రోజంతా సిప్లా హవా నడిచింది. సిప్లా ఏకంగా 9.48 శాతం ఎగిసి రూ.797.70కి చేరుకుంది. రక్షణ శాఖ 101 దిగుమతులను క్రమంగా నిషేధిస్తామని వెల్లడించింది. దీంతో ఎల్ అండ్ టీ రెండు షేర్ రెండు నెలల గరిష్టానికి (దాదాపు 5 శాతం ఎగిసింది) చేరుకుంది. వాల్ చంద్ నగర్ కూడా దాదాపు 5 శాతం ఎగిసింది. హిందూస్తాన్ ఏరో నాటిక్స్ షేర్లు అయితే ఏకంగా 8 శాతానికి పైగా ఎగిశాయి. డిఫెన్స్ షేర్లు అన్ని లాభపడ్డాయి.

గరిష్టం నుండి కిందకు లాగిన రిలయన్స్

గరిష్టం నుండి కిందకు లాగిన రిలయన్స్

ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా నిఫ్టీని లాభాల్లోకి తీసుకు వస్తే, రిలయన్స్ నష్టపోయి గరిష్ట స్థాయి నుండి కిందకు లాగింది. రిలయన్స్ 1.16 శాతం నష్టపోయింది. మొదటి త్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేయడంతో Ipca ల్యాబ్స్ భారీగా లాభపడింది.

English summary

రోజంతా సిప్లా జూమ్, రక్షణశాఖ నిర్ణయం.. ఎల్&టీ సహా ఈ షేర్లు దూసుకెళ్లాయి | Sensex ends 142 points higher, Pharma closes over 5 percent higher

Indian benchmark share indices closed higher on Monday lead by healthy buying in pharma stocks. Sensex settled at 38,182.08, up 141.51 points or 0.37%, while Nifty ended 56.10 points or 0.5% higher at 11,270.
Story first published: Monday, August 10, 2020, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X