For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ ఎఫెక్ట్, బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్ డౌన్: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 12) ఊగిసలాటలో ఉన్నాయి. అయితే ఉదయం నుండి స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న 49,000 మార్కు దాటిన సెన్సెక్స్ అదే మార్క్ వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 18 డాలర్లు లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఫలితాలు అదరగొట్టాయి. ఆరంభం బాగుంటడంతో నిన్న మార్కెట్లు జంప్ చేశాయి.

గత 2నెలల కాలంలోనే సెన్సెక్స్ 7000 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే నేడు ఊగిసలాటలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో బ్యాంకుల ఎన్పీఏలు పెరగవచ్చునని, చెడు రుణాలు రెట్టింపు కావొచ్చునని ఆర్బీఐ అంచనాల నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటేBudget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే

ఊగిసలాటలో మార్కెట్

ఊగిసలాటలో మార్కెట్

నేడు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 101.75 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 49,167.57 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26.80 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 14,458 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 629 షేర్లు లాభాల్లో 663 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 58 షేర్లలో ఎలాంటి మార్పులేదు. గం.11.35 సమయానికి సెన్సెక్స్ 55 పాయింట్లు క్షీణించి 49,214 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ప్రారంభంలో నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సెన్సెక్స్ నష్టాల్లో, నిఫ్టీ లాభ-నష్టాల ఊగిసలాటలో ఉన్నాయి. ఇక డాలర్ మారకంతో రూపాయి 73.43 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.38 వద్ద క్లోజ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో 10.40 శాతం, ఐచర్ మోటార్స్ 5.22 శాతం, గెయిల్ 4.24 శాతం, కోల్ ఇండియా 3.88 శాతం, ఐవోసీ 3.07 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 1.99 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.96 శాతం, టైటాన్ కంపెనీ 1.95 శాతం, సన్ ఫార్మా 1.71 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.66 శాతం నష్టాల్లో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ నేడు 1.47 శాతం ఎగబాకి రూ.1925 వద్ద ట్రేడ్ అయింది

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 0.02 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.21 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.21 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.11 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.38 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.78 శాతం, నిఫ్టీ మీడియా 1.22 శాతం, నిఫ్టీ మెటల్ 1.28 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 0.20 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.51 శాతం, నిఫ్టీ ఐటీ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.92 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.24 శాతం నష్టపోయాయి.

English summary

ఆర్బీఐ ఎఫెక్ట్, బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్ డౌన్: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు | Sensex edges lower, Nifty below 14,500 as banks drag

Metal, Auto and Infra sectors gained 1 percent each. GAIL, Tata Motors, Tata Steel, Eicher Motors and IOC were among major gainers on the Nifty in the early trade.
Story first published: Tuesday, January 12, 2021, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X