For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్, లాభాలకు కారణాలవే: రిలయన్స్ రూ.1.4 లక్షల కోట్లు ఆవిరి!

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 3) భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా దేశాల మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ఫ్యాక్టరీ ఔట్ పుట్ పెరుగుతుందని డేటా వెల్లడిస్తోంది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు బలం చేకూర్చింది. ఎనర్జీ మినహా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంకు, మెటల్, ఫార్మా రంగాలు ఎగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం నుండి 0.4 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 503.55 పాయింట్లు (1.27%) ఎగిసి 40,261.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 144.30 పాయింట్లు(1.24%) లాభపడి 11,813.50 పాయింట్ల వద్ద ముగిసింది. 1391 షేర్లు లాభాల్లో, 1215 షేర్లు నష్టాల్లో ముగియగా, 179 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

మార్కెట్‌ను కాపాడిన బ్యాంకులు, రిలయన్స్ భారీ దెబ్బ.. రూ.లక్షల కోట్లు హాంఫట్

మార్కెట్‌కు బ్యాంకు ఊతం

మార్కెట్‌కు బ్యాంకు ఊతం

టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, ఎన్టీపీసీ, రిలయన్స్, నెస్ట్లే, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్ లాభానికి కారణమయ్యాయి.

రెండు సెషన్లలో నిఫ్టీ బ్యాకు 7.5 శాతం లాభపడింది. గత 5 నెలల్లో ఇది అతిపెద్ద లాభం.

నిఫ్టీ బ్యాంకులో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటానే 606 పాయింట్లుగా ఉంది. నిఫ్టీ బ్యాంకు 790 పాయింట్లు లాభపడింది.

నిఫ్టీలో 35 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా రెండో రోజు నష్టపోయింది. ఈ రెండు సెషన్‌లలో రూ.1.4 లక్షలకోట్లు మార్కెట్ క్యాప్ నష్టపోయింది.

ఐటీ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. రిలయన్స్ స్టాక్ ధర నేడు 1.22 శాతం పడిపోయి రూ.1854 వద్ద ముగిసింది.

ఇండిగో స్టాక్స్ 4 శాతం లాభపడింది.

కాడిలా హెల్త్ 7 శాతం, సన్ ఫార్మా 4 శాతం లాభపడింది.

గోద్రేజ్ ప్రాపర్టీస్ టాప్ మిడ్ క్యాప్ లూజర్.

ఒత్తిడిలో ఐటీ స్టాక్స్

ఒత్తిడిలో ఐటీ స్టాక్స్

నిఫ్టీ ఆటో 1.51 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.14 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.29 శాతం, నిఫ్టీ ఐటీ 0.02 శాతం, నిఫ్టీ మెటల్ 2.24 శాతం, నిఫ్టీ ఫార్మా 1.66 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.74 శాతం, నిఫ్టీ ప్రయివేట్ బ్యాంకు 3.08 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఎనర్జీ 0.53 శాతం, నిఫ్టీ మీడియా 0.33 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.32 శాతం నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.94 శాతం, విప్రో 0.21 శాతం, మైండ్ ట్రీ 0.0038 శాతం, కోఫోర్జ్ 0.77 శాతం లాభపడ్డాయి.

హెచ్‌సీఎల్ టెక్ 1.08 శాతం, ఇన్ఫోసిస్ 0.96 శాతం, టెక్ మహీంద్ర 0.82 శాతం నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్ ఒత్తిడిలో కనిపించాయి.

మార్కెట్ లాభాలకు కారణం

మార్కెట్ లాభాలకు కారణం

మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థల రికవరీ ఆశాజనకంగా ఉండటం వంటి వివిధ కారణాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఆసియా మార్కెట్ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది.

ఇండియా ఫ్యాక్టరీ యాక్టివిటీస్ వేగంగా పెరుగుతున్న సంకేతాలు వచ్చాయి. ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. ఇది మార్కెట్ లాభాలకు దోహదపడింది. ఎక్కువ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా కనిపించాయి.

మార్కెట్ క్యాప్ పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఆ నష్టాలను అధిగమించేలా పుంజుకున్నాయి.

English summary

సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్, లాభాలకు కారణాలవే: రిలయన్స్ రూ.1.4 లక్షల కోట్లు ఆవిరి! | Sensex climbs 504 points: Factors behind stock market rally

Bank and financial stocks continued to be in demand in Tuesday's session taking benchmark indices higher while RIL and Bharti Airtel were among the biggest drags. Firm global cues also helped boost sentiments.
Story first published: Tuesday, November 3, 2020, 19:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X