For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో మార్కెట్లు, డాలర్‌తో రోజురోజుకు బలపడుతున్న రూపాయి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(జూలై 6) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 313.48 పాయింట్లు లేదా 0.87% ఎగిసి 36,334.90 వద్ద, నిఫ్టీ 109.40 పాయింట్లు లేదా 1.03% లాభపడి 10,716.80 వద్ద ప్రారంభమైంది. 883 షేర్లు లాభాల్లో, 302 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 71 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ దాదాపు 460 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది.

<strong>భారీ షాక్: కాగ్నిజెంట్‌లో 18,000 ఉద్యోగాల కోత? లీగల్ యాక్షన్ దిశగా..</strong> భారీ షాక్: కాగ్నిజెంట్‌లో 18,000 ఉద్యోగాల కోత? లీగల్ యాక్షన్ దిశగా..

రూపాయి ఈరోజు మరింత బలపడింది. డాలర్ మారకంతో 14పైసలు బలపడి 74.50 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత 74.62 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 74.64 వద్ద క్లోజ్ అయింది.

 Sensex 400 points higher, Nifty tops 10,700: Rupee rises 14 paise

మధ్యాహ్నం గం.12.00 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, హెచ్‌యూఎల్ ఉన్నాయి. బ్యాంకు, మెటల్, ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. ఫార్మా రంగం మాత్రం నష్టాలు చవి చూస్తోంది. ఎన్ఎస్ఈలో పలు స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండగా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 15 శాతం పెరిగి బ్యారెల్ ధర 42.95 డాలర్లకు చేరుకుంది.

English summary

భారీ లాభాల్లో మార్కెట్లు, డాలర్‌తో రోజురోజుకు బలపడుతున్న రూపాయి | Sensex 400 points higher, Nifty tops 10,700: Rupee rises 14 paise

Benchmark indices extended the early gains and trading near the day's high level. Except pharma, other sectoral indices are trading in the green.
Story first published: Monday, July 6, 2020, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X