For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎఫెక్ట్: మ్యూచువల్ ఫండ్స్‌పై సెబి కొత్త మార్గదర్శకాలు

|

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైనా స్కీంలు క్లోజ్ చేయాలనుకుంటే ఆ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తమ యూనిట్లను విక్రయించుకొని నగదుగా మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ వాటిని గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ చేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధన తీసుకు వచ్చింది. ఏ స్కీం మూసివేయాలని భావిస్తున్నది ముందస్తుగా లిస్టింగ్ చేయతలపెట్టిన స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సెబి బుధవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది.

ఇందులో పలు మార్గదర్శకాలు ఉన్నాయి. ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. మూసివేయాలని భావిస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌ను గుర్తించిన స్టాక్ ఎక్స్చేంజీలలో నమోదు చేసి ట్రేడింగ్‌కు అవకాశం కల్పించాలి. దీంతో ఇన్వెస్టర్లు విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సంబంధిత ఫండ్స్ స్పాన్సర్ చేసే ఏఎంసీతో పాటు ఉద్యోగులు, ట్రస్టీలు కూడా ట్రాన్సాక్షన్స్ నిర్వహించరాదు.

మళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన 'మనీ' సూత్రాలుమళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన 'మనీ' సూత్రాలు

Sebi gives exit option to mutual fund investors

ఇటీవల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ పథకాలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్సాక్షన్స్‌ను కట్టుదిట్టం చేసేందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఏఎంసీల నుంచి సమాచారం అందుకున్న అనంతరం ఆ స్కీమ్స్‌ను ఎలా మూసివేయాలి, వాటిని ఎలా లిస్టింగ్ చేయాలనే అంశాలపై సెబీతో చర్చించి ఆయా స్టాక్ ఎక్స్ఛేంజిలు నిర్ణయిస్తాయి.

ఆర్డర్ పెట్టడం, అమలు, చెల్లింపులు, సెటిల్మెంట్ వంటి అంశాలతో సవివరమైన విధివిధానాలు త్వరలో ప్రకటించనుంది. లిస్టింగ్ సదుపాయం కల్పించాలనుకునే స్టాక్ ఎక్స్ఛేంజీలు వాటి విధివిధానాలను వారం రోజుల్లోగా తెలియజేయాలని సెబి పేర్కొంది.

English summary

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎఫెక్ట్: మ్యూచువల్ ఫండ్స్‌పై సెబి కొత్త మార్గదర్శకాలు | Sebi gives exit option to mutual fund investors

The Securities and Exchange Board of India (Sebi) on Wednesday mandated listing of units of schemes being wound up, giving investors of schemes in Franklin Templeton Mutual Fund (FTMF) an alternative route to access liquidity if they don’t wish to wait for receipts from portfolio investments.
Story first published: Thursday, May 21, 2020, 18:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X