కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. కరోనా కారణంగా ఓ వైపు డిమాండ్ లేక చమురు ధరలు తగ్గాయి. మరోవైపు ఆయా దేశాల్లో స్టోరేజ్ నిల్వలు పెరిగిపోయాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాల పరిస్థితి దిగజారిపోయింది. ఇప్పటికే ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి.

2011 తర్వాత కనిష్టానికి నిల్వలు
మార్చి నెలలో సౌదీ అరేబియా ఫారెన్ అసెట్స్ 2000 తర్వాత తొలిసారి వేగంగా తగ్గిపోయాయి. దీనిని బట్టి చమురు ధరల క్షీణత వల్ల ఉత్పత్తి దేశాల ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు నష్టం జరిగిందో అర్థమవుతోందని చెబుతున్నారు. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం 100 బిలియన్ రియాల్స్ (27 బిలియన్ డాలర్లు) తగ్గి నిల్వలు 464 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2011 తర్వాత అత్యంత కనిష్టం.

ఖర్చులు తగ్గించుకుంటూ..
గత వారం సౌదీ ఆర్థికమంత్రి మొహమ్మద్ అల్ జాదాన్ మాట్లాడుతూ... 120 బిలియన్ రియాల్స్ వరకు ఈ ఏడాదిలో తగ్గవచ్చునని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే చమురు ధరలు దశాబ్దాల కనిష్టానికి పడిపోతుండటం వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతోంది. సౌదీ నిల్వలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటున్నాయి.

భారీగా నష్టపోతున్న చమురు ఉత్పత్తి దేశాలు
మార్చి నెలలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 50 శాతం కుప్పకూలింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మరింతగా పడిపోయింది. బ్యారెల్ 20 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సౌదీ అరేబియా తన బడ్జెట్‌ను సమతౌల్యం చేసుకోవాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సూచించింది. సౌదీ సహా అన్ని చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్ బ్యారెల్‌కు 50 నుండి 70 డాలర్ల వరకు అంచనా వేసుకొని బడ్జెట్‌ను రూపొందించుకున్నాయి. ఇప్పుడు 20 డాలర్లకు పడిపోవడమే కాదు. కనీసం సేల్ లేదు. దీంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.

రెవెన్యూ షాక్
ప్రభుత్వం అంచనాల కంటే రెవెన్యూ భారీగా తగ్గనుందని, ఈ నేపథ్యంలో 220 బిలియన్ రియాల్స్ వరకు రుణాలు పెంచుకునే పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఇది తమ బడ్జెట్‌కు షాక్ అని అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియా ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు అంతర్జాతీయ బాండ్ మార్కెట్‌ను చేరుకుందని, స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల నుండి 19 బిలియన్ డాలర్లు సేకరించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications