For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా థర్డ్ వరల్డ్ వార్‌కు సిద్ధపడుతోందా?: రక్షణ శాఖ బడ్జెట్ నిధులు భారీగా పెంపు

|

బీజింగ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. రష్యా తన దాడి తీవ్రతను పెంచింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్‌, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. ఖార్కీవ్‌లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్‌ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి.

పలు నగరాలపై పట్టు..

పలు నగరాలపై పట్టు..

ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్‌‌పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఎనెర్హొడార్ సిటీలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని వశం చేసుకున్నాయి. ఇదో అతిపెద్ద విజయంగా భావిస్తోంది రష్యా. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది.

చైనా సంచలనం..

చైనా సంచలనం..

ఈ యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న వేళ- చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వార్షిక బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ కేటాయింపులను భారీగా పెంచుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులు 209 బిలియన్ డాలర్లు. తాజాగా ఆర్థిక సంవత్సరం కోసం ఈ మొత్తాన్ని 230 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. 21 బిలియన్ డాలర్లను అధికంగా కేటాయించుకుంది.

7.1 శాతం రక్షణ శాఖకే..

7.1 శాతం రక్షణ శాఖకే..

గ్ఝి జిన్‌పింగ్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో 7.1 శాతం నిధులను రక్షణ శాఖకే కేటాయించినట్లు చైనా డైలీ తెలిపింది. తమ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో ప్రీిమియర్ లీ కెకియాంగ్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపుల కంటే ఇది మూడురెట్లు అధికం.

తమ దేశ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మరింత బలోపేతం చేసుకోనున్నామని, అత్యాధునిక ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రిని సమకూర్చున్నామని లీ కెకియాంగ్‌ను ఉటంకించింది. రక్షణ శాఖకు భారీగా బడ్జెట్‌ను కేటాయించే విషయంలో అమెరికా తరువాత చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది.

 తైవాన్ లక్ష్యంగా..

తైవాన్ లక్ష్యంగా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న ఈ వార్.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం లేకపోలేదంటూ వార్తలొస్తోన్న వేళ.. చైనా తన రక్షణ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేసుకోవడం, బడ్జెట్ కేటయింపులను భారీగా పెంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చనే అభిప్రాయంతో చైనా ఉండొచ్చని అంటున్నారు. డ్రాగన్ కంట్రీ క్రమంగా తైవాన్‌పై యుద్ధానికి దిగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary

చైనా థర్డ్ వరల్డ్ వార్‌కు సిద్ధపడుతోందా?: రక్షణ శాఖ బడ్జెట్ నిధులు భారీగా పెంపు | Russia Ukrain War: China has increased its annual defence budget by 7.1 percent to 230 billion

China on Saturday hiked its annual defence budget by 7.1 per cent to $230 billion from last year's $209 billion.
Story first published: Saturday, March 5, 2022, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X