For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Child pornography: పిట్ట కొంచెం..సెక్స్ వీడియోల కూత ఘనం: ట్విట్టర్‌కు కళ్లు తిరిగే రేంజ్‌లో ఫైన్

|

మాస్కో: మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌కు రష్యా కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. కళ్లు చెదిరే రేంజ్‌లో జరిమానా విధించింది. జరిమానా మొత్తం అసాధారణం.. ఊహకు అందనంత భారీ ఫైన్ అది. ట్విట్టర్‌కు గడువు ఇచ్చినప్పటికీ.. నిర్దేశిత సమయంలోగా అనుకున్న లక్ష్యాన్ని అందుకోకపోవడం వల్ల ఆ సంస్థ యాజమాన్యం ఈ భారీ మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రష్యాలో ప్రస్తుతం ఇదే చర్చనీయంశమైంది.

చిన్న పిల్లలతో సెక్స్, బలవంతంగా శృంగారం చేయడం (Child pornography), వారితో డ్రగ్స్ విక్రయించడం, డ్రగ్స్‌ను వినియోగించేలా ప్రోత్సహించడం వంటి అశ్లీలకర, అభ్యంతరకర వీడియోలు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పోస్ట్ అయ్యాయి. కొందరు రష్యన్లు నకిలీ అకౌంట్లతో ఛైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఇష్టానుసారంగా పోెస్ట్ చేశారు. వాటిని షేర్ చేశారు. అదే సమయంలో- ఆ వీడియోలు పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ కూడా అయ్యాయి. అడల్ట్ కంటెంట్ దీనికి తోడైంది.

Russia: A Moscow court fines Twitter for failure to remove illegal content

ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై అశ్లీలం, అవాంఛనీయ సెక్స్, బలవంతంగా శృంగారంలో పాల్గొనడం వంటి వీడియోలను పోస్ట్ చేయడం రష్యా చట్టాలకు విరుద్ధం. రష్యా ఇంటర్నెట్ లెజిస్లేషన్‌ నిబంధనలు, మార్గదర్శకాలు ఇలాంటి వీడియోలను సోసల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అంగీకరించవు. అయినప్పటికీ- ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున అశ్లీల వీడియోలు పోస్ట్ కావడంపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. వాటిపై మాస్కో న్యాయస్థానం విచారణ చేపట్టింది.

అశ్లీలం, అభ్యంతరకర వీడియోలను తొలగించాలంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. రష్యాకు చెందిన టెలికమ్ వాచ్‌డాగ్ రోస్కోమ్నడ్జోర్.. ఇలాంటి వీడియోలపై నిఘా ఉంచింది. ట్విట్టర్ ట్రాఫిక్‌ను నియంత్రించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ వీడియోలను తొలగించడంలో ట్విట్టర్ యాజమాన్యం విఫలం కావడంతో ట్విట్టర్ రీచ్‌ను తగ్గించింది. నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అయినప్పటికీ- సకాలంలో ఆ వీడియోలను తొలగించడంలో ఆ సంస్థ యాజమాన్యం విఫలమైంది.

ఫలితంగా- మాస్కో న్యాయస్థానం తాజాగా తన తీర్పును వినిపించింది. 8.9 మిలియన్ రూబుళ్ల జరిమానాను విధించింది. అమెరికన్ డాలర్లతో పోల్చుకుంటే దీని విలువ 1,16,568. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే 85 లక్షల 53 వేల 532 రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి ట్విట్టర్ సంస్థకు మాస్కో న్యాయస్థానం 60 రోజుల గడువు ఇచ్చింది. తీర్పు వినిపించినప్పటి నుంచి 60 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు గ్జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

English summary

Child pornography: పిట్ట కొంచెం..సెక్స్ వీడియోల కూత ఘనం: ట్విట్టర్‌కు కళ్లు తిరిగే రేంజ్‌లో ఫైన్ | Russia: A Moscow court fines Twitter for failure to remove illegal content

A Moscow court on Friday fined Twitter 1,16,568 dollars for violating Russia's Internet legislation by failing to remove content banned in the country. Part of the content in question urged minors to take part in illegal protests, promoted drug use, and spread child pornography.
Story first published: Saturday, April 3, 2021, 19:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X