For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇరాన్-అమెరికా టెన్షన్స్: డాలర్‌తో భారీగా నష్టపోయిన రూపాయి

|

ముంబై: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బంగారం, క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. దీంతో భారతీయ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చమురు ధరలు అంతకంతకు పెరగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 31 పైసలు తగ్గి 72.11 వద్ద ట్రేడ్ అయింది.

అమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరఅమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Rupee tanks 31 paise to 72.11 per dollar on rising crude price

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఫారెక్స్ ట్రేడర్స్ అంటున్నారు. సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారన్ ఎక్స్చేంజ్‌లో డాలర్‌తో రూపాయి 72.03 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 72.11కి పడిపోయింది. గత క్లోజింగ్ కంటే 31 పైసలు నష్టపోయింది. శుక్రవారం రూపాయి 71.81వద్ద క్లోజయింది. కాగా, అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 70.59 (2.90 శాతం) పెరిగింది.

English summary

ఇరాన్-అమెరికా టెన్షన్స్: డాలర్‌తో భారీగా నష్టపోయిన రూపాయి | Rupee tanks 31 paise to 72.11 per dollar on rising crude price

The rupee depreciated by 31 paise to 72.11 in early trade on Monday weighed by the spike in crude oil prices, amid rising concerns over US-Iran tensions.
Story first published: Monday, January 6, 2020, 12:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X