For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ మారకంతో భారీగా బలహీనపడిన రూపాయి, 76.34 వద్ద క్లోజ్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ కూడా 74 పైసలు బలహీనపడింది. దేశీయ మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. కానీ కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నేడు (ఏప్రిల్ 8) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 30వేల దిగువకు చేరుకుంది. నిఫ్టీ 8,748 వద్ద ముగిసింది.

డాలర్ మారకంతో రూపాయి కూడా రోజు రోజుకు బలహీనపడుతోంది. ఈ రోజు 74 పైసలు బలహీనపడి రూ.76.37కి కూడా పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల ఊగిసలాట నేపథ్యంలో రూపాయిపై ప్రభావం పడింది. గత ముగింపు 75.63తో పోలిస్తే ఈ రోజు ఉదయం 18 పైసలు బలహీనపడి 75.81 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఓ సమయంలో 74 పైసలు నష్టపోయింది. 76.34 వద్ద సెటిల్ అయింది.

నష్టాల్లో ముగిసిన మార్కెట్: నిన్న అందుకే రికార్డ్‌లు, సెన్సెక్స్ టాప్ 10 గెయిన్స్ ఇవేనష్టాల్లో ముగిసిన మార్కెట్: నిన్న అందుకే రికార్డ్‌లు, సెన్సెక్స్ టాప్ 10 గెయిన్స్ ఇవే

Rupee settles 70 paise lower at 76.34 against dollar

మంగళవారం డాలర్ మారకంతో 55 పైసలు బలపడి 75.63 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు ఏకంగా 70 పైసలకు పైగా నష్టపోయి రికార్డ్ కనిష్టానికి చేరుకుంది. రూపాయికి ఇది జీవనకాల కనిష్టం. కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దేశీయ, అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. అయితే రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి.

English summary

డాలర్ మారకంతో భారీగా బలహీనపడిన రూపాయి, 76.34 వద్ద క్లోజ్ | Rupee settles 70 paise lower at 76.34 against dollar

At the interbank foreign exchange, the rupee opened weak at 75.83, then lost further ground and finally settled for the day at 76.34, registering a fall of 70 paise over its previous close.
Story first published: Wednesday, April 8, 2020, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X