For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడిని రూ.3 కోట్లను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..

|

స్టాక్ మార్కెట్ లో అనేక మల్టీ బ్యాగర్ స్టాకులు ఉన్నాయి. వాటిలో కజారియా సెరామిక్స ఒకటి. రూ.19,714.58 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ ఫ్లోర్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్, డిజైనర్ టైల్స్‌లో ఉత్పత్తిదారుగా ఉంది. ఇది మిడ్-క్యాప్ కంపెనీ. ఉత్తరప్రదేశ్‌లోని సికింద్రాబాద్, రాజస్థాన్‌లోని గైల్‌పూర్, మలూటానా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, శ్రీకాళహస్తి, గుజరాత్‌లోని మూడు ప్లాంట్లు ఉన్నాయి.

రూ.3.40

రూ.3.40

దీర్ఘకాలిక పెట్టుబడి హోరిజోన్‌లో పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో కజారియా సిరామిక్స్ ఒకటి. NSEలో కజారియా సెరామిక్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం రూ.1,240.00 వద్ద ముగిసింది. ఈ స్టాక్ ధర 1 జనవరి 1999 నాటికి రూ.3.40 నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్‌ ఇచ్చింది. ఫలితంగా, 23 సంవత్సరాల క్రితం స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి ఈరోజు విలువ రూ.3.64 కోట్లు అవుతుంది.

RSI సూచిక విలువ 67.10

RSI సూచిక విలువ 67.10

ఈ స్టాక్ గత ఐదేళ్లలో 71.44% లాభపడింది. గత మూడేళ్లలో 135.44% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. ఈ స్టాక్ గత సంవత్సరంలో 8.73% పెరిగింది. NSEలో, స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి ₹1,374.90 చేరింది. 52 వారాల కనిష్ట స్థాయి రూ.885.30గా ఉంది. సెప్టెంబరు 16, 2022న, కజారియా సిరామిక్స్ లిమిటెడ్ RSI సూచిక విలువ 67.10గా ఉంది.

టార్గెట్ ప్రైస్ రూ.1,355

టార్గెట్ ప్రైస్ రూ.1,355

జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ ప్రమోటర్ వాటా 47.50%, FIIలు 19.58%, DIIలు 22.40%, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 10.52% ఉంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.137.38 పుస్తక విలువను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ రూ.1,355 టార్గెట్ ధర నిర్ణయించింది. ఏకీకృత ప్రాతిపదికన, కంపెనీ Q1FY23లో ₹1008.22 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది.

note: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది. ఇందులో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.

English summary

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడిని రూ.3 కోట్లను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. | Rs.3.40 Stock Rs. Multi bagger stock rises to 1240

With a market worth of ₹19,714.58 crore, Kajaria Ceramics Ltd. is a mid-cap company that operates in the consumer discretionary goods and services (CDGS) industry.
Story first published: Sunday, September 18, 2022, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X