For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ

|

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుంది. దీనికి తోడు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపింది. అలాగే, దేశీయ అతిపెద్ద కంపెనీ, లిస్టెడ్ కంపెనీల్లో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దారుణంగా పతనమైంది. ఈ స్టాక్ ఏకంగా 5.58 శాతం నష్టపోయి రూ.1935 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో రూ.2050 వద్ద ముగిసింది. నేడు రూ.114కు పైగా పడిపోయింది.

రిలయన్స్ నిన్న భారీగా నష్టపోవడంతో ముఖేష్ అంబానీ సంపద 5.2 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. నిఫ్టీ 50 స్టాక్స్‌లోని ఎన్నో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఆదాయం ఎక్కువగా కోల్పోయింది. నిన్నటి ట్రేడింగ్‌లో సగటున నిమిషానికి 13 మిలియన్ డాలర్లు నష్టపోయారు ముఖేష్ అంబానీ. ఈ నష్టంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీల్లో ముఖేష్ 12వ స్థానానికి పడిపోయారు. ఇంతకుముందకు సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.

RIL’s weak Q3 earnings make Mukesh Ambani lose dollar 5.2 billion in one day

2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు బాగున్నప్పటికీ, ప్రగతి అలాగే, ఆయిల్ టు కెమికల్ బలహీనంగా కనిపించిందని, ఇది మార్కెట్ అంచనాలను చేరుకోలేదని, అందుకే నిన్న స్టాక్స్ నష్టపోయాయని చెబుతున్నారు.

English summary

ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ | RIL’s weak Q3 earnings make Mukesh Ambani lose dollar 5.2 billion in one day

It was not a good Monday for Mukesh Ambani, the owner of India’s largest listed company Reliance Industries, as RIL stock tanked over 5 per cent leading to a notional loss of wealth worth close to $5.2 billion for the family.
Story first published: Tuesday, January 26, 2021, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X