మార్కెట్లు పతనమైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి మాత్రం పెట్టుబడులు ఆగలేదు. జూన్ లో ఈక్విటీలోకి రూ. 15,497.76 కోట్లు వచ్చాయి. మేలో రూ. 18,529.43 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ. 15890.38 కోట్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన AMFI వివరాలు వెల్లడించింది. జూన్ మధ్యలో మార్కెట్లు కరెక్షన్‌ను ఎదుర్కొన్నప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు బలమైన SIP లతో ఈక్విటీలోకి పెట్టుబడులు కొనసాగించారని మార్కెట్ నిపుణులు
కారణాలు ఇవే..
జూన్ నెలలో రికార్డు స్థాయిలో ఎఫ్‌ఐఐ అమ్మకాలు జరిగాయి. అయినప్పటికీ లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్,ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు ఈక్విటీ ఫండ్స్ కేటగిరీలోకి పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ 2021 నుంచి నిరంతర FII విక్రయాలు ప్రపంచ మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ప్రవాహాల పరిమాణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ, భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ-ఆధారిత ఫండ్స్‌పై తమ విశ్వాసాన్ని కొల్పోలేదు. బిట్‌కాయిన్లు, Ethereum ధరలలో క్షీణత, పెట్టుబడిదారులలో దీర్ఘకాలిక పెట్టుబడి పట్ల పెరిగిన అవగాహన ఈక్విటీలోకి పెట్టుబడులు పెరగడానికి కారణమైంది.

డెట్ ఫండ్ లో తగ్గిన పెట్టుబడులు
ఈ నెలలో ఇండెక్స్ ఫండ్స్, ఇతర ఇటిఎఫ్‌ల్లోకి రూ.12659.69 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో డెట్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గాయి. పైగా చాలా మంది పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications