For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI వద్ద ఈ ఏడాది బంగారం నిల్వలు ఎంత పెరిగాయంటే?

|

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సహా 14 దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను 2019లో పెంచుకున్నాయి. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2019లో ఆర్బీఐ పసిడి కొనుగోళ్లు పెద్ద ఎత్తున పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం తెలిపారు.

త్వరపడండి!: 2020లో రూ.45,000కు చేరుకోనున్న బంగారం!!త్వరపడండి!: 2020లో రూ.45,000కు చేరుకోనున్న బంగారం!!

భారత్ వద్ద ఉన్న బంగారం నిల్వలు ఎంత అంటే?

భారత్ వద్ద ఉన్న బంగారం నిల్వలు ఎంత అంటే?

RBI పసిడి నిల్వలు ఈ ఏడాది 60 టన్నులు దాటి ఉండవచ్చునని సోమసుందరం అన్నారు. ఈ ఏడాదే ఒక టన్నుకు పైగా నిల్వలు పెంచుకున్నట్లుగా భావిస్తున్నారు. రష్యా, చైనా దేశాల వద్ద పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకు బంగారం కొనుగోళ్లలో ఈ రెండు దేశాలే ముందున్నాయి. ఇండియా, టర్కీ, పోలాండ్, కజకిస్తాన్ దేశాలు కూడా పసిడిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తాయి.

టాప్ దేశాలు..

టాప్ దేశాలు..

ఎక్కువ బంగారం నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో అమెరికా, జర్మనీ, ఐఎంఎఫ్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, ఇండియా ఉన్నాయి.

ద్వితీయార్థంలో కొనుగోళ్లలో తగ్గుదల

ద్వితీయార్థంలో కొనుగోళ్లలో తగ్గుదల

ఈ ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా రూ.40,000 మార్క్ దాటాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో ధరలు రూ.32,000 నుంచి రూ.34,000 మధ్య ఉంది. దీంతో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. కానీ ద్వితియార్థానికి వచ్చేసరికి ధరలు ఏకంగా రూ.39,000, రూ.40,000గా ఉంది. బంగారం ధరలు ఈ ఏడాది 20 శాతానికి పైగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. బంగారం మార్కెట్‌కు ప్రథమార్థంలో కనిపించిన ఆదరణ ద్వితీయర్థంలో కనిపించలేదని చెబుతున్నారు.

2020లోను బంగారానికి ప్రాధాన్యత

2020లోను బంగారానికి ప్రాధాన్యత

ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని, ఈ ఏడాదిలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఇన్వెస్టర్లకు సవాలుగా మారవచ్చునని, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నాయని, దీంతో స్టాక్ ధరలు గరిష్ట స్థాయిలో ఉండవచ్చునని, అలాగే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు రక్షణగా భావించే బంగారం వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.

English summary

RBI వద్ద ఈ ఏడాది బంగారం నిల్వలు ఎంత పెరిగాయంటే? | Reserve Bank of India increasing its reserves by over 60 tonne

According to Bullion market experts, the Reserve Bank of India (RBI) was one of the main buyers of gold in 2019, increasing its reserves by over 60 tonne.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X