For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ నెంబర్ వన్! కారణాలివే..

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిసాధిస్తున్న 50 రిటైలర్స్‌లలో రిలయన్స్ రిటైల్ ముందుంది. డెలాయిట్స్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2020 ఇండెక్స్ ప్రకారం 2013 నుండి 2018 మధ్య వేగంగా వృద్ధి సాధించిన సంస్థల్లో రిలయన్స్ రిటైల్ ఉంది. 2018లో ఆయా సంస్థల రెవెన్యూ ప్రకారం డెలాయిట్ 250 కంపెనీలకు ర్యాంక్ ఇచ్చింది. అంతకుముందు ఏడాది 94వ ర్యాంకులో ఉన్న రిలయన్స్ రిటైల్ మరుసటి ఏడాది 56కు ఎగబాకింది.

ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు

ఆరో స్థానం నుండి తొలి స్థానానికి రిలయన్స్ రిటైల్

ఆరో స్థానం నుండి తొలి స్థానానికి రిలయన్స్ రిటైల్

వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రిటైలర్స్‌ల్లో ఇండియాకు చెందిన రిలయన్స్ రిటైల్ 2017 ఆర్థిక సంవత్సరంలో 6వ స్థానంలో ఉండగా, 2018లో మొదటి స్థానానికి ఎకబాకిందని డెలాయిట్ పేర్కొంది. ఈ జాబితాలో స్థానం సంపాదించిన వాటిల్లో భారత్ నుండి రిలయన్స్ ఒక్కటే ఉంది. సగానికి పైగా జపాన్, మూడో వంతు చైనా, హాంగ్‌కాంగ్ దేశాల సంస్థలే ఉన్నాయి.

భారీగా పెరిగిన ఆదాయం

భారీగా పెరిగిన ఆదాయం

రిలయన్స్ రిటైల్ 55.8% సగటు వృద్ధిని నమోదు చేసింది. 2017-18 ఏడాదిలో రిలయన్స్ రిటైల్ 18.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 88.4% వృద్ధిని నమోదు చేసింది.

10వేలకు పైగా స్టోర్స్

10వేలకు పైగా స్టోర్స్

వ్యాపార విస్తరణలో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా 10వేలకు పైగా స్టోర్స్‌ను ఏర్పాటు చేసిన తొలి సంస్థ రిలయన్స్ రిటైల్. రిటైల్‌తో పాటు ఈ-కామర్స్‌ వ్యాపారంపై కూడా దృష్టి సారించింది. ఆన్‌లైన్‌లో ఫోన్ల అమ్మకాలు, ajio.com వెబ్‌సైట్ ద్వారా ఈ-కామర్స్ వృద్ధిపై దృష్టి పెట్టడం సహా పలు నిర్ణయాలు రిలయన్స్ మెరుగు కావడానికి కారణాలుగా సర్వే పేర్కొంది.

హామ్‌లేస్ కొనుగోలు కూడా కారణం

హామ్‌లేస్ కొనుగోలు కూడా కారణం

ajio.com వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం మరింత బలోపేతం కావడం, బ్రిటన్‌కు చెందిన బొమ్మల రిటైలర్‌ హామ్‌లేస్‌ను కొనుగోలు చేయడం వల్ల కూడా మెరుగైన వృద్ధికి దోహదం చేసిందని ఈ నివేదిక తెలిపింది.

ఈ విభాగంలో వాల్‌మార్ట్ టాప్

ఈ విభాగంలో వాల్‌మార్ట్ టాప్

ఈ జాబితాలో వాల్‌మార్ట్ స్టోర్స్ తొలిస్థానంలో ఉంది. రెండో స్థానంలో క్యాస్ట్‌కో హోల్‌సేల్ కార్ప్ ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మూడో స్థానానికి ఎగబాకింది. పలు విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న క్రోగర్(అమెరికా) మాత్రమే టాప్ 10లోకి వచ్చింది.

మందగమనంలోను..

మందగమనంలోను..

దేశవ్యాప్తంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ రిటైల్ రంగం మాత్రం పుంజుకుందని, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ అంచనాలకు మించి దూసుకు వెళ్తోందని, వచ్చే ఏడాదికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇందుకు కలిసి వచ్చిందని చెబుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధిస్తున్న సర్‌ఛార్జీ ఎత్తివేత, పలు పారిశ్రామిక రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి కీలక నిర్ణయాలని కేంద్రం తీసుకుందని చెబుతున్నారు.

English summary

ప్రపంచంలోనే ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ నెంబర్ వన్! కారణాలివే.. | Reliance Retail tops list of 50 fastest growing retailers globally

Billionaire Mukesh Ambani led Reliance Retail has topped the list of 50 fastest growing retailers globally between FY2013-2018 in the Deloitte's Global Powers of Retailing 2020 index.
Story first published: Monday, February 24, 2020, 9:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X