బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ హోల్డర్స్‌కు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌హాట్ తీసుకు వచ్చింది. రిలయన్స్ రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేర్ హోల్డర్లకు ఈ రైట్స్ ఇష్యూపై సమాధానం ఇస్తుంది. ఈ చాట్‌బాట్ తొలిసారి పబ్లిక్ ఆఫరింగ్ కోసం రూపొందించారు. దీనిని జియో హాప్టిక్ టెక్నాలజిస్ అభివృద్ధి చేసింది.

తొలిసారి షేర్ హోల్డర్స్‌కు చాట్‌బాట్
భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు తొలిసారి సహాయం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను కంపెనీ ఉపయోగిస్తోంది. రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూ సమస్యలపై వాటాదారుల ప్రశ్నలకు AI ద్వారా సమాధానం లభిస్తుంది. ఇది ఇండియా ఇంక్ చరిత్రలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ. దీంతో AI మేధకు సంబంధించి కీలక ముందడుగు వేసింది రిలయన్స్. పెట్టుబడిదారులకు భారతీయ స్టాక్ మార్కెట్లలో సాయం చేసేందుకు దీనిని తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా రైట్స్ ఇష్యూకు సంబంధించిన సమాచారాన్ని వాటాదారులకు తెలియచేసేందుకు చాట్‌బాట్‌ను రంగంలోకి దింపింది.

ఈ నెంబర్ ద్వారా ఇంగ్లీష్ సహా ఈ భాషల్లో..
జియో నెంబర్ +91-7977111111కు హాయ్ అని వాట్సాప్ సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది. చాట్‌బాట్ ఇంగ్లీషులో సమాధానం ఇస్తుంది. ఎఫ్‌ఏక్యూ వీడియోలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఉంటాయి. రిలయన్స్ కంపెనీకి 2.6 మిలియన్ల షేర్ హోల్డర్స్ ఉండగా, వాట్సాప్‌కు 400 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.

ఈ వివరాలు ఉంటాయి
పై నెంబర్‌కు వాట్సాప్ చేస్తే సమాధానాలు, వీడియో లింక్స్ వస్తాయి. రైట్స్ ఇష్యూకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, షేర్ హోల్డర్స్అర్హత, ఫిజికల్ షేర్ ట్రేడింగ్, శాంపిల్ ఫామ్స్ వంటివి అందిస్తుంది. మే 20వ తేదీన ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ జూన్ 3వ తేదీన ముగుస్తుంది.

హాప్టిక్ ఇన్ఫోటెక్ కొనుగోలు
రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ఇన్ఫోకామ్ గత ఏడాది ఏప్రిల్ నెలలో చాట్‌బాట్ తయారీ సంస్థ హాప్టిక్ ఇన్ఫోటెక్‌ను రూ.230 కోట్లకు కొనుగోలు చేసింది. దీని విస్తరణ కోసం మరో రూ.700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, కాల్ సెంటర్స్‌కు సహకారిగా ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ చాలామంది ఉపయోగిస్తున్నందున సీనియర్ సిటిజన్లకు మరింత ఉపయోగపడుతుంది.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications