For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ అదుర్స్: BPని దాటేసిన రిలయన్స్ ఎం-క్యాప్, కానీ...

|

ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో రికార్డ్ సృష్టించింది. స్టాక్ మార్కెట్లో రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. బుధవారం RIL షేర్లు 0.79 శాతం లాభంతో రూ.1,484 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) 131.635 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన రూపాయల్లో దాదాపు రూ.9,28,396 కోట్లు. ఇది బ్రిటిష్ పెట్రోలియం (BP) కంపెనీ ఎం-క్యాప్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన కంపెనీల్లో ఆరో స్థానంలో నిలిచింది. గత పది నెలల కాలంలోనే ఈ కంపెనీ షేర్లు 31 శాతం పెరిగాయి. ఈ షేర్లు వ్యాల్యూ రోజు రోజుకూ పెరుగుతోంది.

టెలికో కష్టాలపై కేంద్రం కమిటీ, కస్టమర్లకు షాక్: ఉచిత కాల్స్టెలికో కష్టాలపై కేంద్రం కమిటీ, కస్టమర్లకు షాక్: ఉచిత కాల్స్

ఆరో స్థానానికి RIL

ఆరో స్థానానికి RIL

బుధవారం నాడు స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ఈ ఆయిల్ టు టెలికం మేజర్ మార్కెట్ క్యాప్ 131.635 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో BP మార్కెట్ క్యాప్ 129.9 బిలియన్ డాలర్లుగా ఉంది. RIL ప్రపంచంలోనే ఆరో స్థానానికి ఎగబాకగా, BP 7వ స్థానానికి పడిపోయింది. BP థర్డ్ క్వార్టర్ లాభాలు 41 శాతం పడిపోవడంతో ఈ కంపెనీ షేర్లు నష్టపోతున్నాయి. దీంతో కంపెనీ ఎం-క్యాప్ తగ్గింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో BP షేర్లు మంగళవారం 3.8 శాతం నష్టపోయి 6.33 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఓ వైపు ఇయర్ బేసిస్‌లో BP షేర్లు 0.7 శాతం నష్టపోగా, RIL షేర్లు 31 శాతం ఎగిశాయి.

టాప్ 7 కంపెనీలు

టాప్ 7 కంపెనీలు

మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఇంధన కంపెనీలు...

1. ఎగ్జాన్ మొబైల్ (M-cap 290.42 బిలియన్ డాలర్లు),

2. రాయల్ డచ్ షేల్ (M-cap 238.15 బిలియన్ డాలర్లు),

3. చెవ్రాన్ కార్ప్ (M-cap 224.92 బిలియన్ డాలర్లు),

4. పెట్రో చైనా (M-cap 149.20 బిలియన్ డాలర్లు),

5. టోటల్ ఎస్ఏ (M-cap 141.74 బిలియన్ డాలర్లు),

6. RIL (M-cap 131.635 బిలియన్ డాలర్లు),

7. BP (M-cap 129.9 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి.

M-క్యాప్ పెరిగింది కానీ...

M-క్యాప్ పెరిగింది కానీ...

అదే సమయంలో ఇక్కడ రెండు కంపెనీలను పోల్చలేం కూడా. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ వ్యాపారాల్లో ఉంది. ఎనర్జీ, పెట్రో కెమికల్స్, టెక్స్‌టైల్స్, నేచరల్ రిసోర్సెస్, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ వ్యాపారాల్లో ఉంది. కానీ BP మాత్రం ఎనర్జీ కంపెనీ.

English summary

ముఖేష్ అంబానీ అదుర్స్: BPని దాటేసిన రిలయన్స్ ఎం-క్యాప్, కానీ... | Reliance Industries surpasses strategic partner BP in terms of m cap

The Reliance Industries shares have been on gaining spree and touched a fresh 52 week high of Rs.1,484 on the bourses on Wednesday, amid the conglomerate's plan to create a holding company for its digital platform initiatives
Story first published: Thursday, October 31, 2019, 8:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X