For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన చైనా జీడీపీ, ఎందుకంటే: నాలుగో త్రైమాసికంపై ఒత్తిడి

|

2021 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు దారుణంగా క్షీణించింది. రెండో త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి నమోదు చేసిన డ్రాగన్ కంట్రీ, మూడో త్రైమాసికంలో 4.9 శాతానికి పడిపోయింది. జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 18.3 శాతంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. గత మూడు త్రైమాసికాల జీడీపీలో 64.8 శాతం వాటా వినియోగానిదేనని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకున్నది. చైనా ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా వినియోగం పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. దీంతో ముడిసరుకులకు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగాయి. దీంతో పాటు ఎవర్ గ్రాండ్ రియాల్టీలో నెలకొన్న సంక్షోభం, బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగుచూడటం కూడా వృద్ధిరేటు మందగించడానికి కారణమైంది.

నాలుగో త్రైమాసికంలో ఒత్తిడి

నాలుగో త్రైమాసికంలో ఒత్తిడి

చైనాలో కన్స్యూమర్ గూడ్స్ రిటైల్ సేల్స్16.4 శాతం పెరిగి 4.9 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. తొలి మూడు త్రైమాసికాల్లో వ్యాల్యూ ఆధారిత పారిశ్రామిక ఉత్పత్తి 11.8 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో పెట్టుబడులు 7.3 శాతం పెరిగాయి. సెప్టెంబర్ మాసంలో పట్టణ ప్రాంత నిరుద్యోగం 4.9 శాతం నమోదయింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 0.5 శాతం క్షీణత.

జనవరి-సెప్టెంబర్ కాలంలో పట్టణ ప్రాంతంలో కొత్తగా 10.45 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో ఈ ఏడాది ఉద్యోగ కల్పన లక్ష్యంలో 95 శాతం చేరుకున్నట్లయింది. నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి కొనసాగే అవకాశముందని దీంతో ఈ ఏడాది మొత్తం గణాకాలపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు.

నాలుగో త్రైమాసికంలో..

నాలుగో త్రైమాసికంలో..

సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.9 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు వేసిన 5 శాతం నుండి 6 శాతం అంచనా కంటే ఇది తక్కువ. జనవరి-మార్చి, ఏప్రిల్-జూన్ త్రైమాసికాలతో పోలిస్తే ఇది తక్కువ. చైనా ఈ ఏడాది జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో 18.3 శాతం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.

కరోనా నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పటికీ రియాల్టీ రంగంలోని ఎవర్ గ్రాండ్ ద్వారా తలెత్తిన సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. డిసెంబర్ నెలతో ముగిసే నాలుగో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 3.2 శాతం మించకపోవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.

నిరుద్యోగం తగ్గుముఖం

నిరుద్యోగం తగ్గుముఖం

సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు క్షీణించినప్పటికీ నిరుద్యోగం కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది కాలంలో పట్టణ ప్రాంతాల్లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది. గత తొమ్మిది నెలల్లో పట్టణ ప్రాంతాల్లో 104.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు చైనా ప్రకటించింది.

English summary

భారీగా తగ్గిన చైనా జీడీపీ, ఎందుకంటే: నాలుగో త్రైమాసికంపై ఒత్తిడి | Q3 GDP growth hits one year low of 4.9 percent amid power crunch, COVID 19

China's GDP grew by 9.8% year on year in the first three quarters, though economic growth in the third quarter slowed to a one year low of 4.9% amid unexpected economic challenges including a power crunch and coronavirus resurgence.
Story first published: Tuesday, October 19, 2021, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X