For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: పైసలను కోట్లు చేసిన ఫార్మా మల్టీబ్యాగర్.. మీరూ కొన్నారా..?

|

Multibagger Stock: పెన్నీ స్టాక్స్ చాలా రిస్క్ తో కూడుకున్నవి. అయితే కొన్ని సార్లు ఇవి లక్షలను లక్షలు కోట్లుగా మార్చి ఇన్వెస్టర్ల తలరాతను మార్చేస్తుంటాయి. ఇందుకోసం కావాల్సిందల్లా ఓపిక, రీసెర్చ్ స్కిల్స్ మాత్రమే.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్ల గురించే. ఒకప్పుడు కేవలం 20 పైసల ధర కలిగిన ఈ కంపెనీ స్టాక్ ప్రస్తుతం తన ఇన్వెస్టర్ల తలరాతలు మార్చి మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దాదాపు 22 ఏళ్ల కిందట ఈ కంపెనీ స్టాక్ ధర 20 పైసలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రస్తుతం దాని ధర రూ.386కి చేరుకుంది.

bullstocks-

జూలై 14, 1995లో ఈ స్టాక్ ధర రూ.10.10 వద్ద ఉండగా.. ఆ తర్వాత 2001 సెప్టెంబర్ 17 నాటికి 20 పైసలకు తగ్గింది. తాజాగా మార్చి త్రైమాసికంలో బలమైన రాబడులను అందించటంతో స్టాక్ ధర 4.90 శాతానికి పైగా పెరిగింది. దీంతో స్టాక్ నేడు మార్కెట్లో తన ప్రయాణాన్ని రూ.374.40 వద్ద మధ్యాహ్నం 2 గంటలకు కొనసాగుతోంది. అక్టోబర్ 11, 2022న స్టాక్ తన 52 వారాల గరిష్ఠ ధర ఇయిన రూ.461.60ని తాకింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.88.12 కోట్లుగా ఉంది. అలాగే కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1003.98 కోట్లుగా నమోదైంది.

కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2023 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.4.50 తుది డివిడెండ్ ప్రకటించింది. తాము స్థిరంగా ముందుకు సాగుతున్నామని, వాటాదారుల అంచనాలను అందుకోగలమని విశ్వసిస్తున్నట్లు ప్రజ్ ఇండస్ట్రీస్ CEO & MD శిశిర్ జోషిపురా అన్నారు. వివిధ రకాల జీవ ఇంధనాల ఉత్పత్తి కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నారు. 'స్వదేశీ' సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మిశ్రమంతో నడిచే దేశీయ మొట్టమొదటి వాణిజ్య విమానాన్ని నడిపేందుకు కంపెనీ AirAsia India, IOCLతో చేతులు కలిపింది.

English summary

Multibagger Stock: పైసలను కోట్లు చేసిన ఫార్మా మల్టీబ్యాగర్.. మీరూ కొన్నారా..? | praj industries share gave multibagger returns to investors in long term, know details

praj industries share gave multibagger returns to investors in long term, know details
Story first published: Friday, May 26, 2023, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X