For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్, ఉపసంహరణపై కొత్త రూల్స్

|

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్‌కు శుభవార్త. పోస్టాఫీస్ జీడీఎస్ (గ్రామీణ్ డాక్ సేవ) వద్ద నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. ఇండివిడ్యువల్స్‌కు ఉపసంహరణ పరిమితిని రూ.5000 నుండి పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేట్లు తగ్గించిన సమయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఏడాదికి నాలుగు శాతంగా ఉంది. పోస్టాఫీస్ క్యాష్ డిపాజిట్, క్యాష్ ఉపసంహరణకు సంబంధించి మారిన కొన్ని రూల్స్ ఇక్కడ చూడవచ్చు.

నగదు ఉపసంహరణ పరిమితి పెంపు

నగదు ఉపసంహరణ పరిమితి పెంపు

- పోస్టాఫీస్ జీడీఎస్ (గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచీల్లో నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకు నగదు ఉపసంహరణ పరిమితి రూ.5,000 ఉండగా, ఇక నుండి రూ.20,000కు పెంచుతున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్ డిపాజిట్లు పెంచే లక్ష్యంతో పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

- ఏ బ్రాంచీ పోస్ట్‌మాస్టర్ కూడా క్యాష్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్‌ను రూ.50,000కు మించి యాక్సెప్ట్ చేయరాదు.

RICT CBS యాప్ ద్వారా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)/సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం ( SCSS )/మంత్లీ ఇన్‌కం స్కీం (MIS)/కిసాన్ వికాస్ పత్ర (KVP)/నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీంలు అందుబాటులో ఉంటాయి. వీటిలో విత్‌డ్రా ఫామ్ లేదా చెక్ ద్వారా మాత్రమే వీటిలో డిపాజిట్ అనుమతిస్తారు.

రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్..

రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్..

ఒకరోజులో అకౌంట్ నుండి రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయరాదు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ రూ.500 ఉండాలి. మినిమం బ్యాలెన్స్ లేకుంటే రూ.100 మీ అకౌంట్ నుండి డిడక్ట్ అవుతుంది. అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజు కింద దీనిని డిడక్ట్ చేస్తారు.

మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి

మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి

డిపార్టుమెంట్ ఆఫ్ పోస్టాఫీస్ గత ఏడాది డిసెంబర్ నెలలో మినిమం బ్యాలెన్స్‌ను తప్పనిసరి చేసింది. సేవింగ్స్ అకౌంట్‌లో కనీసం రూ.500 ఉండాలి. మినిమ బ్యాలెన్స్ లేకుంటే రూ.100 ప్లస్ జీఎస్టీ మొత్తం అకౌంట్ నుండి డిడక్ట్ అవుతుందని పేర్కొంది.

English summary

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్, ఉపసంహరణపై కొత్త రూల్స్ | post office savings account: New rules on cash deposit, withdrawal

In a bid to provide relief to Post Office Savings account holders, India Post has announced it will raise the withdrawal limit at Post Office GDS (Gramin Dak Seva) branches. The withdrawal limit per individual has been hiked from ₹5,000. At a time, when various banks are cutting savings account interest rate, the post office savings account interest rate is at 4 per cent per annum.
Story first published: Sunday, March 7, 2021, 20:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X