6 కోట్ల మంది రైతులకు గుడ్‌న్యూస్! పీఎం కిసాన్ స్కీం కింద ఏడాదికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దీనిని మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2,000 అందిస్తోంది. ప్రధాని మోడీ రైతులకు ఈ పెట్టుబడి కానుకను నూతన సంవత్సర సందర్భంగా జనవరి 2, 2020న అందించనున్నారు.

రూ.12,000 కోట్లు రైతుల అకౌంట్లలోకి..
జనవరి 2 దేశవ్యాప్తంగా 6వేల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ కానున్నాయి. అంటే వీరి అకౌంట్లలో రూ.12,000 కోట్లు జమ అవుతున్నాయి. కొత్త ఏడాది కానుకగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.

పాన్-బ్యాంకు అకౌంట్ లింక్ తప్పనిసరి..
డిసెంబర్ 1వ తేదీ నుంచి తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ రైతులకు క్రెడిట్ కాలేదు. 2019 చివరి విడత రూ.2,000 రైతులకు అందించనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు అకౌంట్ లింక్ చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు వస్తాయి. ఆరున్నర కోట్ల మంది రైతులు ఆధార్ - బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకున్నారు. వీరికి ప్రయోజనం చేకూరనుంది.

14 కోట్ల మందికి ప్రయోజనం కానీ...
మొత్తంగా 14 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందే అర్హత కలిగినవారు ఉన్నారని అంచనా. డిసెంబర్ 29 నాటికి కేంద్రానికి 9.2 కోట్ల మంది రైతుల డేటా అందింది. పశ్చిమ బెంగాల్లో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీంకు నో చెబుతోంది. ఉత్తర ప్రదేశ్ నుంచి 2.4 కోట్ల రైతులకు గాను 2 కోట్ల మంది రైతుల డేటా అందింది.

రూ.75వేల కోట్లలో 40 శాతం మిగులు!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.75,000 కోట్లు కేటాయించింది. వివిధ కారణాల వల్ల ఇందులో రూ.45,000 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుండగా, దాదాపు 40 శాతం బడ్జెట్ నిధులు మిగలనున్నాయి. నవంబర్ 30 వరకు కేంద్రం రూ.35,955.66 కోట్లు రైతుల అకౌంట్లలోకి ట్రాన్సుఫర్ చేసింది. ఇప్పుడు మరో రూ.12 కోట్లకు పైగా ట్రాన్సుఫర్ చేయనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications