For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రంగంలోకి రూ.19 వేల కోట్ల పెట్టుబడులు, 2.40 లక్షల మందికి ఉద్యోగాలు

|

టెక్స్‌టైల్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కింద 61 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో గిన్నీ పిలమెంట్స్, కింబర్లే క్లార్క్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, అరవింద్ లిమిటెడ్ తదితర 61 సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ పీఎల్ఐ పథకానికి మొత్తం 67 సంస్థల నుండి ప్రతిపాదనలు వచ్చాయి. ఆమోదించిన 61 దరఖాస్తుల ద్వారా రూ.19,077 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తున్నాయి. దీంతో రూ.1,84,917 కోట్ల టర్నోవర్ ఉంటుందని, 2.40 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎగుమతుల పెంపు లక్ష్యం

ఎగుమతుల పెంపు లక్ష్యం

దాదాపు రూ.15 వేల కోట్ల మేర జరుగుతున్న జౌళీ ఎగుమతులకు రూ.60,000 కోట్ల నుండి రూ.75,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం 67 దరఖాస్తుల్లో మొదటి విభాగం కింద 15, రెండో విభాగం కింద 52 వచ్చాయి. మొదటి విభాగంలో కనీస పెట్టుబడి రూ.300 కోట్లు, ప్రోత్సాహకాలు పొందేందుకు టర్నోవర్ రూ.600 కోట్లు. రెండో విభాగం కింద కనీస పెట్టుబడి రూ.100 కోట్లు కాగా, ప్రోత్సాహకాలు పొందడానికి కనీస టర్నోవర్ రూ.200 కోట్లుగా నిర్ణయించారు.

దరఖాస్తులు

దరఖాస్తులు

ఆవ్‌గోల్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, గోవా గ్లాస్ ఫైబర్ లిమిటెడ్, హెచ్‌పీ కాటన్ టెక్స్‌టైల్స్ మిల్క్, కింబర్లే క్లార్క్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, మధుర ఇండస్ట్రియల్ టెక్స్‌టైల్స్, ఎంసీపీఐ ప్రయివేట్ లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్‌పోర్ట్స్, ట్రైడెంట్ లిమిటెడ్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ వంటి సంస్థల దరఖాస్తులకు ఆమోదం లభించింది.

రాష్ట్రాలకు ప్రత్యేక విధానం

రాష్ట్రాలకు ప్రత్యేక విధానం

మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం కింద 13 రాష్ట్రాల నుండి 17 ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో మధ్యప్రదేశ్ నుండి నాలుగు, కర్నాటక నుండి రెండు వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపించారు. ఈ పథకం కింద ఏడు పార్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.

English summary

ఈ రంగంలోకి రూ.19 వేల కోట్ల పెట్టుబడులు, 2.40 లక్షల మందికి ఉద్యోగాలు | PLI scheme for textiles: 61 firms to invest Rs 19,077 crore in 5 years

A selection committee chaired by Textiles Secretary has approved 61 applicants under the PLI scheme for textiles, which is expected to attract Rs 19,077 crore investment and create 240,134 direct employment over the next five years, a top government official said on Thursday.
Story first published: Friday, April 15, 2022, 8:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X