Fact Check: గూగుల్ పేకు ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వలేదా..! క్లారిటీ ఇచ్చిన పీఐబీ..
ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో నిజాల కంటే అసత్యలు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. తాజాగా గూగుల్ పేకు ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయాయి. గూగుల్ పేతో చాలా మంది చెల్లింపులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్తలు చూసిన వారు కంగారు పడ్డారు.
పీఐబీ క్లారిటీ
దీనిపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్ న్యూస్ ను పరిశీలించి నకిలీదని తెలిపింది. గూగుల్ పేని ఆర్‌బీఐ గుర్తించలేదని ఆర్‌బిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త పూర్తిగా నకిలీదని పీఐబీ పేర్కొంది. ఇందులో నిజం లేదని తేల్చిచెప్పింది. Google Pay అనేది UPI ద్వారా లావాదేవీలు చేయడానికి లైసెన్స్ పొందింది స్పష్టం చేసింది.

ఇలా చెక్ చేసుకోండి
మీరు ఏదైనా వైరల్ సందేశం వాస్తవాన్ని తనిఖీ చేయాలనుకుంటే, ఆ వార్తలను వాస్తవంగా తనిఖీ చేసే సదుపాయాన్ని PIB అందిస్తుంది. దీని కోసం మీరు Facebook https://factcheck.pib.gov.in/లో దాని అధికారిక లింక్‌ని సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, మీరు pibfactcheck@gmail.comకు ఇమెయిల్ చేయడం ద్వారా లేదా WhatsApp నంబర్ 8799711259కి సందేశం పంపడం ద్వారా సమాచార వాస్తవం ఔనా కాదో తెలుసుకోవచ్చు.