For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణలో గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్స్ భారీ పెట్టుబడులు

|

తెలంగాణలో రెండు ఫార్మా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. జినోమ్ వ్యాలీలో గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లతో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. లారస్ ల్యాబ్స్ కూడా తయారీ రంగంలోనే రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీల ద్వారా 1750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అమెరికా యూనిట్‌ను విక్రయించిన హైదరాబాద్ అరబిందో.. ఎందుకంటేఅమెరికా యూనిట్‌ను విక్రయించిన హైదరాబాద్ అరబిందో.. ఎందుకంటే

లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ ఫార్మా దిగ్గజాల ప్రతినిధులు తమ ప్రతిపాదనల్ని కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. రూ.700 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, దీంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఈ రెండు సంస్థలు కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళాయి. కంపెనీల ప్రతిపాదనలను కేటీఆర్ స్వాగతించారు.

 Pharma firms Granules and Laurus Labs to invest Rs 700 crore in Telangana

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌ సమీపంలో ఉన్న జినోమ్ వ్యాలీలో పలు ఫార్మా సంస్థలు ఉన్నాయి. ఫార్మా రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఇక్కడ తక్కువ కాలంలో దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 200 ప్రధాన ఫార్మాస్యూటికల్ హబ్స్‌లో 10,000మంది శాస్త్రవేత్తలు ప‌ని చేస్తున్నారు.

English summary

తెలంగాణలో గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్స్ భారీ పెట్టుబడులు | Pharma firms Granules and Laurus Labs to invest Rs 700 crore in Telangana

Pharma companies Granules India and Laurus Labs will be investing ₹400 crore and ₹300 crore respectively to set up new manufacturing facilities in Genome Valley, Hyderabad.
Story first published: Tuesday, October 27, 2020, 22:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X