అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. మే నెల కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెరికా బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ధరలు జీరో కంటే దిగువకు పడిపోయాయి. ధరలు ఈ స్థాయికి పడిపోవడం చరిత్రలో తొలిసారి. ఓ దశలో WTI బ్యారెల్ ధర మైనస్ 37.63 డాలర్లకు పడిపోయింది.

జూన్ ఫ్యూచర్స్ 20 డాలర్లు
కరోనా కారణంగా ప్రజాజీవనం స్తంభించడంతో చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్లకు తగ్గించుకున్నాయి. ఇది మే 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఉత్పత్తి ఎక్కువగా, డిమాండ్ తక్కువగా ఉంది. చమురును నిల్వ కేంద్రాల్లోకి తరలించారు. ఏప్రిల్ 10 నాటికే అమెరికాలో నిల్వ సామర్థ్యం 75 శాతం పూర్తయింది. మరో మూడు వారాల్లో ఇది పూర్తిగా నిండిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నిల్వ ఖర్చును తగ్గించుకోవడం కోసం ధరలు తగ్గించారు చమురుఉత్పత్తిదారులు. మరోవైపు, కొనుగోలుదారుల వద్ద కూడా నిల్వ ఉంది. దీంతో తమ వద్ద ఉన్న అదనపు చమురును వదిలించుకునేందుకు అమ్మేవారే డబ్బులు ఇచ్చి.. చమురును ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఏప్రిల్‌లోనే సామర్థ్యం పూర్తవడంతో మే ఆర్డర్లకు కొనుగోలుదారులు వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూన్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 20 డాలర్ల కంటే పైన ఉంది.

స్టోరేజ్ కెపాసిటీ ఇప్పటికే నిండింది
మన దేశంలో నిల్వ సామర్థ్యం తక్కువ. ధరలు పడిపోయినప్పుడు ఇతర దేశాల నిల్వ కేంద్రాలను అద్దెకు తీసుకుంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో చమురు నిల్వలు పెరిగిపోవడంతో ఆ పరిస్థితి లేదు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గిన ధరల ప్రయోజనం కస్టమర్‌కు బదలీ కావడం కష్టం. ఎందుకంటే ఈ ధరల తగ్గుదల కూడా తాత్కాలికమే. ధరల తగ్గుదల వల్ల వినియోగదారులకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమీ లేదు. దీర్ఘకాలంలో ధరలు తగ్గితే మాత్రం కస్టమర్‌కు ప్రయోజనం.

మన దేశంలో ఎవరెవరికి లాభం
ధరల తగ్గుదల వల్ల విమానయాన రంగానికి ప్రయోజనం. కానీ మన వద్ద లాక్ డౌన్, ప్రపంచ దేశాల్లో విమానయాన సర్వీలుపై ఆంక్షల వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేదు. మే నెలలో కార్యకలాపాలు పునరుద్ధరిస్తే ప్రయోజనం ఉంటుంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విమానరంగానికి చమురు ధర తగ్గుదల కాస్త ఊరట. చమురు ఉప ఉత్పత్తుల వల్ల నడిచే పేయింట్ పరిశ్రమకు కూడా కాస్త లబ్ధి. నిల్వ సామర్థ్యం, దానికి అయ్యే ఖర్చుపై ఆధారపడి.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లాభాలు వస్తాయి.

పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గవో తెలుసా?
ప్రస్తుతం వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధరలు తగ్గాయి. కానీ ఒమన్, దుబాయ్, బ్రెంట్ క్రూడ్ ఆధారిత బాస్కెట్ ధరలు తగ్గలేదు. మనం కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడాయిల్ ధర కేవలం 5 శాతం మాత్రమే పడిపోయి, బ్యారెల్ 27 డాలర్లు పలికింది. ఇది వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ వలె చవకైనది కాదు.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications