For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముంబైలో సెంచరీకి చేరువలో పెట్రోల్: ఇంధన ధరల ట్యాక్స్ బ్రేక్ ఇలా...

|

పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మే 18) రోజున మళ్లీ పెరిగాయి. ఇంధన ధరలు పెరగడం ఈ నెలలో పదవసారి. లీటర్ పెట్రోల్ పైన 27 పైసలు, డీజిల్ పైన 29 పైసలు పెంచుతూ దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ సెంచరీ సమీపానికి చేరుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.93 దగ్గరగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి.

నెలకు రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.1 కోటి!నెలకు రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.1 కోటి!

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.99.14, డీజిల్ రూ.90.71,ఢిల్లీలో పెట్రోల్ రూ.92.85, డీజిల్ రూ.83.51గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.94.54, లీటర్ డీజిల్ రూ.88.34, కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.692, డీజిల్ రూ.86.35, పుణేలో పెట్రోల్ రూ.98.77, డీజిల్ రూ.88.96, బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04, నోయిడాలో పెట్రోల్ రూ.90.66, డీజిల్ రూ.83.97, గురుగ్రామ్ పెట్రోల్ రూ.90.73, డీజిల్ రూ.84.09గా ఉంది.

పన్నులు ఎలా...

పన్నులు ఎలా...

పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.

క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.4 శాతం పెరిగి 66.27 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 1.1 శాతం ఎగిసి 69.46 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

ముంబైలో సెంచరీకి చేరువలో పెట్రోల్: ఇంధన ధరల ట్యాక్స్ బ్రేక్ ఇలా... | Petrol, Diesel Prices Today: Petrol price crosses Rs 99 mark in Mumbai

Petrol and diesel prices on Tuesday was yet again hiked after being paused on Monday by the oil marketing companies.
Story first published: Tuesday, May 18, 2021, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X