For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, Diesel Prices: ఈ ప్రాంతాలలో రూ.100 దాటిన పెట్రోల్ ధర

|

రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న(మే 10 సోమవారం) మళ్లీ పెరిగాయి. నేడు కూడా అదే ఒరవడి కొనసాగింది. అంతకుముందు వరుసగా నాలుగు రోజుల పాటు ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు స్థిరంగా ఉండి, నిన్న పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన నేడు 25-27 పైసలు, డీజిల్ పైన 33 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.91.53 నుండి రూ.91.80కు, డీజిల్ రూ.82.36కి పెరిగింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.91.8, లీటర్ డీజిల్ రూ.82.36గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.98.12, డీజిల్ రూ.89.48, చెన్నైలో పెట్రోల్ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్‌కతా 91.92, డీజిల్ రూ.85.20 వద్ద ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రూ.100 మార్కును దాటింది. పెట్రోల్ జైసల్మేర్‌లో రూ.100.71, బికానీర్‌లో రూ.100.70గా ఉంది. బార్మెర్‌లో రూ.99.82గా ఉంది.మహారాష్ట్రలోని నాందెడ్‌లో పెట్రోల్ రూ.100.30గా ఉంది.

ఎంత పెరిగిందంటే

ఎంత పెరిగిందంటే

అసెంబ్లీ ఎన్నికల తర్వాత లేదా ఈ నెలలో లీటర్ పెట్రోల్ పైన రూ.1.41, డీజిల్ పైన రూ.1.68 పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటతో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.

ఎంత పెరిగాయంటే

ఎంత పెరిగాయంటే

పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 70 డాలర్లకు సమీపంలో ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇటీవల బ్యారెల్‌కు 4 సెంట్లు లేదా 0.1 శాతం పెరిగి 68.32 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 2 సెంట్లు లేదా 0.03 శాతం పెరిగి 64.92 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Petrol, Diesel Prices: ఈ ప్రాంతాలలో రూ.100 దాటిన పెట్రోల్ ధర | Petrol, Diesel Prices Hit All Time Highs: Up For Second Straight Day

Fuel prices have been increased for the second consecutive day on Tuesday. While petrol price has been soared by a steep 25-27 paise per litre, diesel by 33 paise for a litre, according to the chart released by state-owned fuel retailers.
Story first published: Tuesday, May 11, 2021, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X