For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, diesel prices hiked: 9వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ మే నెలలో మొత్తం 8 సార్లు పెరిగాయి. ఒకరోజు విరామం అనంతరం నేడు (ఆదివారం మే 16) లీటర్ పెట్రోల్ పైన 24 పైసలు, లీటర్ డీజిల్ పైన 27 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.58, లీటర్ డీజిల్ రూ.83.22కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ రూ.96.22, లీటర్ డీజిల్ రూ.90.73కు చేరుకుంది.

Akshaya Tritiya: కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్?Akshaya Tritiya: కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్?

పలు ప్రాంతాల్లో రూ.100 క్రాస్

పలు ప్రాంతాల్లో రూ.100 క్రాస్

ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. ముంబైలో త్వరలో సెంచరీ చేరుకోవచ్చు. ఇంధన ధరల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాయే అధికంగా ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్ను కింద లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 వసూలు చేస్తోంది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.98.88, లీటర్ డీజిల్ రూ.90.40, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.92.67, లీటర్ డీజిల్ రూ.86.06, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.94.31, లీటర్ డీజిల్ రూ.88.07, బెంగళూరులో పెట్రోల్ రూ.95.33, డీజిల్ రూ.87.92, హైదరాబాద్‌ పెట్రోల్ రూ.96.22, డీజిల్ రూ.90.73, తిరువనంతపురం పెట్రోల్ లీటర్ రూ.94.81, డీజిల్ రూ. 89.70గా ఉంది.

పన్నులు ఇలా

పన్నులు ఇలా

దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటితో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి.

English summary

Petrol, diesel prices hiked: 9వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol, diesel prices hiked for ninth time this month

After a day's hiatus, petrol and diesel rates were raised again on Sunday for the ninth time this month to scale record high.
Story first published: Sunday, May 16, 2021, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X