For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, Diesel prices: వరుసగా 17వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదిహేడో రోజు (ఆగస్ట్ 3, మంగళవారం) స్థిరంగా ఉన్నాయి. రెండు వారాలకు పైగా ధరల్లో ఎలాంటి మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే నేడు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్కసారి పెరగలేదు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదల లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.76గా ఉంది.

 Petrol and Diesel prices unchanged for 17th Day

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ క్రూడాయిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వంటి అంశాల కారణంగా కాస్త పైకి చేరుకున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ ధర 75 డాలర్లకు సమీపంలో ట్రేడ్ అయింది. చమురు డిమాండ్ పైన వినియోగం, ఒపెక్ దేశాల సరఫరా పెరుగుతుందనే అంశాల నేపథ్యంలో చమురు ధరలు ఇటీవల మూడు శాతం క్షీణించాయి.

English summary

Petrol, Diesel prices: వరుసగా 17వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు | Petrol and Diesel prices unchanged for 17th Day

Since May after the assembly elections concluded in some of the states, price of fuel has been rising, with petrol prices now at a record high and already above Rs. 100 levels in most of the cities.
Story first published: Tuesday, August 3, 2021, 8:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X