For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Magical Stock: మ్యాజిక్ చేసిన 5 పైసల స్టాక్.. లక్షను రూ.5.40 కోట్లు చేసింది.. మీదగ్గర ఉందా..?

|

Magical Stock: రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్ మెంట్స్ చేసేవారే మిలీనియర్స్ అవుతారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేసింది ఒక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్. ఈ స్టాక్ తన దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఏకంగా 52,430 శాతం బలమైన రాబడిని అందించింది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మిలియనీర్ కావచ్చని ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్‌ స్టాక్ నిరూపించింది. తన ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చి చూపించింది ఈ పెన్నీ స్టాక్. గడచిన 20 ఏళ్ల కాలంలో పెట్టుబడిదారులకు స్టాక్ 52,430 శాతం రిటర్న్స్ అందించింది.

షేర్ ధర హిస్టరీ..

షేర్ ధర హిస్టరీ..

ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ షేర్ ధర హిస్టరీని గమనిస్తే.. 20 ఏళ్ల కిందట షేర్ ధర కేవలం 5 పైసలు మాత్రమే. ప్రస్తుతం ఈ పెన్నీ స్టాక్ ధర రూ.293 రూపాయలకు చేరుకుంది. అంటే 2002 అక్టోబర్ లో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి.. దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే అతను దాదాపు రూ.5.45 కోట్లను పొందేవారు. దీర్ఘకాలం సరైన కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని కంపెనీ మరోసారి నిరూపించింది.

 జూన్ లో గరిష్ఠ స్థాయికి..

జూన్ లో గరిష్ఠ స్థాయికి..

ఈ స్టాక్ 2021 జూన్ లో తన జీవితకాల గరిష్ఠమైన రూ.366ను తాకింది. ఆ సమయంలో లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ.6.65 కోట్లకు చేరుకుంది. ఈ రోజు స్టాక్ ధర రూ.297.75 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.167.25 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.308గా ఉంది.

 కంపెనీ బిజినెస్..

కంపెనీ బిజినెస్..

ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ చమురు, గ్యాస్ లాజిస్టిక్స్‌లో ప్రధానమైనది. 1956లో స్థాపించబడిన ఈ కంపెనీ 462 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ఆదాయం Q1FY22లో రూ.678 కోట్లు ఉండగా.. ఈ ఏడాది అది రూ.2,235 కోట్లకు చేరుకుంది. కిందటి త్రైమాసికంలో Q2లో రూ.2,103 కోట్ల ఆదాయానికి.. రూ.107 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు నమోదు చేసింది.

English summary

Magical Stock: మ్యాజిక్ చేసిన 5 పైసల స్టాక్.. లక్షను రూ.5.40 కోట్లు చేసింది.. మీదగ్గర ఉందా..? | Penny Stock Aegis Logistics Ltd Stock Turned 1 Lakh Into 5.45 crores in long run

Penny Stock Aegis Logistics Ltd Stock Turned 1 Lakh Into 5.45 crores in long run
Story first published: Wednesday, October 26, 2022, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X