దేశంలో మధ్య తరగతి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారు చాలా మంది చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తారు. అయితే వీరు నమ్మకమైన పథకాల్లో పెట్టుబడి పెడతారు. అలాంటి పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ప్రచుర్యం పొందాయి. తపాలా శాఖ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్ కింద అనేక ప్లాన్‌లను ప్రారంభించింది. వాటిలో గ్రామ సురక్ష యోజన అత్యంత ప్రజాదరణ పొందింది.

పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన అనేది పూర్తి జీవిత బీమా
పాలసీ. ఇది ఐదు సంవత్సరాల కవరేజీ తర్వాత ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీకి మార్చుకునే అవకాశం ఉంది. ఇది 55, 58, లేదా 60 సంవత్సరాల వయస్సు వరకు తగ్గిన ప్రీమియంలను చెల్లించడం ద్వారా పాలసీదారుని గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.

గ్రామ సురక్ష యోజన
గ్రామ సురక్ష యోజన కింద ప్రతి నెలా కేవలం రూ. 50 చెల్లించడం ద్వారా పాలసీదారుడు రూ. 35 లక్షల వరకు రిటర్న్స్‌లో రాబడి పొందవచ్చు. వ్యక్తి ప్రతి నెలా పాలసీలో రూ.1,515 పెట్టుబడి పెడితే, అంటే రోజుకు దాదాపు రూ.50, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత ఆ వ్యక్తి రూ.34.60 లక్షల రాబడిని అందుకుంటాడు. పెట్టుబడిదారుడు 55 సంవత్సరాల కాలానికి రూ. 31,60,000, 58 సంవత్సరాల కాలానికి రూ. 33 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందుకుంటారు.

గ్రామీణ భారతీయుల కోసం
రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) 1995లో ప్రవేశ పెట్టారు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, "ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం సాధారణంగా గ్రామీణ ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలు, మహిళా కార్మికులకు సహాయం చేయడం ముఖ్య ఉద్దేశం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications