For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Best Currency: ప్రపంచంలో అత్యుత్తమ కరెన్సీ ఇదే..! మందగమనంలోనూ పైపైకి.. రూపాయి పరిస్థితి..

|

Best Currency: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం తీవ్రమవుతున్నందున, రూపాయి మాత్రమే కాకుండా అన్ని ప్రధాన కరెన్సీలు US డాలర్‌తో మారకంలో క్షీణతను కొనసాగిస్తున్నాయి. ఈ రోజు రూపాయి కనిష్ఠాలకు చేరుకుంది.డాలర్ తో రూపాయి మారకపు విలువ 82.72కి చేరుకుంది. ఇలాంటి సందర్భంలో ప్రపంచంలోని ఇతర కరెన్సీల పనితీరు ఎలా ఉందనే విషయం చూద్దాం.

పాకిస్తాన్ రూపాయి..

పాకిస్తాన్ రూపాయి..

ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది పాకిస్తాన్ రూపాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ ఆ దేశ కరెన్సీ విలువ ఊహించని రీతిలో పెరిగింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీగా గుర్తింపు పొందింది.

ఈనెల మెుదటి వారంలో..

ఈనెల మెుదటి వారంలో..

అక్టోబరు 7తో ముగిసిన వారంలో చాలా కరెన్సీలు క్షీణించడంతో.. సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ రూపాయి మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కరెన్సీగా గుర్తించబడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి 3.9 శాతం పెరిగి 219.92కి చేరుకుంది. విపరీతంగా విదేశీ పెట్టుబడులు పోగుపడటం వల్లే ఇలా జరుగినట్లు తెలుస్తోంది.

 కొత్త ఆర్థిక మంత్రి..

కొత్త ఆర్థిక మంత్రి..

సెప్టెంబర్ 28న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉన్న సమయంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకుడు ఇషాక్ దార్ కొత్త ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆయన వచ్చిన తర్వాత US డాలర్‌తో రూపాయి విలువ క్షీణతను నియంత్రించే పాత విధానాన్ని అమలులోకి తెచ్చారు.

 పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ..

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ..

జూలైలో US డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 240 రూపాయలకు క్షీణించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల మధ్య పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇషాక్ దార్ నియామకానికి 15 రోజుల ముందు నుంచే 12 శాతం వరకు కరెన్సీ విలువ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం భారత కరెన్సీ కంటే దాయాది పాకిస్తాన్ కరెన్సీ పనితీరు అనేక మంది ఆర్థిక వేత్తలను అయోమయంలోకి గురిచేస్తోంది.

Read more about: pakistan rupee dollar business news
English summary

Best Currency: ప్రపంచంలో అత్యుత్తమ కరెన్సీ ఇదే..! మందగమనంలోనూ పైపైకి.. రూపాయి పరిస్థితి.. | pakistan rupee performing best in the world amid recesson and dollar demand rising

pakistan rupee performing best in the world amid recesson and dollar demand rising
Story first published: Monday, October 10, 2022, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X