For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ..

|

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ICICI బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు ఈ రోజు, జనవరి 7, 2023 నుంచి అమలులో వచ్చాయి. సవరించిన ప్రకారం, ICICI బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరిచింది. 15 నెలల నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల గరిష్ట వడ్డీ రేటు ఇప్పుడు 7.15% అందిస్తోంది.

6.50% వడ్డీ

6.50% వడ్డీ

7 నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 4.50% వడ్డీ రేటును ఇస్తోంది. 30 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ICICI బ్యాంక్ 5.25% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, ICICI బ్యాంక్ 5.50% వడ్డీ రేటును అందిస్తోంది. 61 రోజుల నుండి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, బ్యాంక్ ఇప్పుడు 5.75% వడ్డీ రేటును చెల్లిస్తుంది. 91 నుంచి 184 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.25% వడ్డీ లభిస్తుంది. 185 నుంచి 270 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50% వడ్డీ లభిస్తుంది.

7.10% వడ్డీ రేటు

7.10% వడ్డీ రేటు

271 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 6.65% వడ్డీ రేటును ఇస్తోంది. ICICI బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.10% వడ్డీ రేటును అందిస్తోంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, ICICI బ్యాంక్ 7.15% వడ్డీ రేటును ఇస్తోంది.

సీనియర్ సిటిజన్‌

సీనియర్ సిటిజన్‌

అయితే 2 సంవత్సరాలు, 1 రోజు నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, బ్యాంక్ 7.00% వడ్డీ రేటును చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్‌లు 15 నెలల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై గరిష్టంగా 7.50% రాబడిని అందుకుంటారు.

English summary

ICICI Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ.. | One of the leading private banks, ICICI Bank has revised interest rates on bulk fixed deposits from Rs 2 crore to Rs 5 crore.

One of the leading private banks, ICICI Bank has revised interest rates on bulk fixed deposits from Rs 2 crore to Rs 5 crore. According to the bank's official website, the new rates are effective from today, January 7, 2023.
Story first published: Saturday, January 7, 2023, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X