For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: ప్రతిరోజు రూ.417 పెట్టుబడితో మీరే కోటీశ్వరులు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. టాక్స్ లాభాలు కూడా..

|

PPF Investment: మీరు చిన్నమెుత్తం పొదుపు చేస్తూ.. కోటీశ్వరులు కావాలని కలలుకంటున్నట్లయితే మీకోసం ఒక సరైన మార్గం ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని కోసం మీరు మంచి పెట్టుబడి అలవాటను అలవరచుకోవాల్సి ఉంటుంది. తక్కువ మెుత్తంలో డబ్బును సేవ్ చేయటం ద్వారా ఎలా కోటీశ్వరులుగా మారాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వ పథకంలో పెట్టుబడి..

ప్రభుత్వ పథకంలో పెట్టుబడి..

ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని అందించే అనేక పెట్టుబడి పథకాలు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఉన్నాయి. అటువంటి పెట్టుబడి ఎంపికల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. రిస్క్ వద్ధనుకునే ఇన్వెస్టర్లకు PPF అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి ఆప్షన్. అలాగే.. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం డబ్బును ఆదా చేయాలని చూస్తున్నవారు దీనిని బాగా ఇష్టపడతారు. మీరు PPFలో నెలవారీ డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలను పొందవచ్చు.

PPF వడ్డీ రేటు, మెచ్యూరిటీ..

PPF వడ్డీ రేటు, మెచ్యూరిటీ..

ప్రస్తుతం PPF ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వడ్డీ నెలవారీ ప్రాతిపదికన లెక్కించబడుతుంది. పెట్టుబడిదారులు తమ డబ్బును వరుసగా 15 సంవత్సరాలు తమ PPF ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే.. 15 సంవత్సరాల చివరిలో డబ్బు అవసరం లేకపోతే, PPF ఖాతా పదవీకాలాన్ని అవసరమైనన్ని సంవత్సరాల పాటు పొడిగించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పీపీఎఫ్ ఖాతాల్లో ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

పన్ను ఆదా..

పన్ను ఆదా..

PPF ప్రస్తుతం హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పన్ను మినహాయింపుకు అర్హులు. ఇతర స్థిర పెట్టుబడి ప్రణాళికలతో పోలిస్తే ఇది అధిక రాబడిని ఇస్తుంది. PPF వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంది. ప్రస్తుతం.. ప్రభుత్వం PPF పథకాల కింద చేసే అన్ని పెట్టుబడులకు వార్షిక వడ్డీ రేటుతో 7.1% రిటర్న్‌ అందిస్తోంది.

మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలు..

మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలు..

PPFలో తెలివిగా పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రతి నెలా కొన్ని వేల రూపాయల పెట్టుబడితోనే మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలు పొందుతారు. దీని కోసం మీరు ప్రతి సంవత్సరం 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.12,500. అంటే ప్రతిరోజు రూ.417 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల పెట్టుబడి తర్వాత.. మీ ప్లాన్ మెచ్యూర్ అయినప్పుడు.. మీకు 7.1% వడ్డీ రేటుతో దాదాపు రూ. 40 లక్షలు పొందుతారు. అయితే, 15 సంవత్సరాల తప్పనిసరి మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత 5 సంవత్సరాల బ్లాక్‌లలో PPF ఖాతాను పొడిగించే అవకాశం పెట్టుబడిదారులకు ఉంది. అందువల్ల PPF ఖాతాలో 20 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ. 66 లక్షల కార్పస్ ఏర్పడుతుంది. ఈ పెట్టుబడి నిర్ణయాన్ని ఇలాగే కొనసాగిస్తే.. 25 ఏళ్లలో మీ పీపీఎఫ్ బ్యాలెన్స్ దాదాపు రూ. కోటికి చేరుకుంటుంది.

English summary

Investment: ప్రతిరోజు రూ.417 పెట్టుబడితో మీరే కోటీశ్వరులు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. టాక్స్ లాభాలు కూడా.. | one can make one crore corpus with daily 417 saving in ppf account with safety and tax benefits too

saving in this government saving scheme will give tou one crore return know details
Story first published: Sunday, August 21, 2022, 18:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X