For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాక్సీన్, తగ్గిన నిల్వల, రికవరీ ఎఫెక్ట్: చమురు ధరలు హైజంప్

|

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ గెలుపు, అనంతరం వ్యాక్సీన్ ప్రకటన ఈక్విటీ మార్కెట్, బులియన్ మార్కెట్, చమురు మార్కెట్ పైన భారీ ప్రభావం చూపించింది. ఈక్విటీ, చమురు మార్కెట్లు పుంజుకోగా, పసిడి మార్కెట్ పతనమైంది. కరోనా వ్యాక్సీన్ త్వరలో వస్తుందనే వార్తల నేపథ్యంలో ప్రధానంగా చమురు ధరలు పుంజుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. వ్యాక్సీన్ వస్తే ఇంకా వేగవంతమవుతుందని, అప్పుడు చమురు డిమాండ్ పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో చమురు ధరలు పెరిగాయి.

2 లక్షల కొత్త ఉద్యోగాలు: జోబిడెన్‌తో కలిసి పని చేసేందుకు భారత ఐటీ పరిశ్రమ రెడీ2 లక్షల కొత్త ఉద్యోగాలు: జోబిడెన్‌తో కలిసి పని చేసేందుకు భారత ఐటీ పరిశ్రమ రెడీ

చమురు ధరలు జంప్

చమురు ధరలు జంప్

అమెరికా, యూరోపియన్ దేశాల్లో కరోనా వణికిస్తోంది. పలుదేశాలు మరోసారి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కానీ వ్యాక్సీన్ ప్రకటన చమురు ధరలకు జీవం పోసింది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ చమురు బ్యారెల్ 44 డాలర్లను దాటింది. న్యూయార్క్ మార్కెట్‌లో నైమెక్స్ చమురు 42 డాలర్లను సమీపించింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ కూడా పెరిగింది. జోబిడెన్ గెలుపు, కోవిడ్ వ్యాక్సిన్ వంటి అంశాల నేపథ్యంలో అంతకుముందు నుండే చమురు ధరలు దాదాపు 3 శాతం ఎగిశాయి.

ఐదు నెలల కాలంలో సింగిల్ డే హై

ఐదు నెలల కాలంలో సింగిల్ డే హై

బ్రెంట్ క్రూడాయిల్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు సోమవారం ఒక్కోటి 8 శాతం చొప్పున పెరిగింది. గత ఐదు నెలల కాలంలో సింగిల్ డే భారీ జంప్ ఇదే కావడం గమనార్హం. బిడెన్ గెలుపు, ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి తోడు ప్రధానంగా వ్యాక్సీన్ అంశం చమురుతో పాటు అన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని చెబుతున్నారు. వ్యాక్సీన్ అనేది చమురు మార్కెట్‌కు గేమ్ చేంజింగ్ అని జేపీ మోర్గాన్ తెలిపింది.

ఇది కూడా కారణం..

ఇది కూడా కారణం..

సౌదీ అరేబియా ఎనర్జీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు కూడా చమురు ధరలు పెరగడానికి దోహదపడ్డాయని చెబుతున్నారు. పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్(OPEC), ఇతర చమురు రంగ దేశాలు ఆగస్ట్ నుండి డిసెంబర్ కాలంలో చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఒపెక్ దేశాలు రోజుకు 7.7 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. ఆ తర్వాత జనవరిలో 2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని తగ్గించవచ్చు. ఇటీవల లిబియాలో 1 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి పెరిగింది.

నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుకున్నట్లు అమెరికన్ పెట్రోలియం ఇనిస్టిట్యూట్ మంగళవారం తెలిపింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువ. 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నాయి.

English summary

వ్యాక్సీన్, తగ్గిన నిల్వల, రికవరీ ఎఫెక్ట్: చమురు ధరలు హైజంప్ | Oil Prices gain as vaccine hopes outweigh lockdown impact

Oil prices rose on Tuesday as hopes that a COVID-19 vaccine could be on the horizon outweighed the expected negative impact on fuel demand of new lockdowns to curb the virus.
Story first published: Wednesday, November 11, 2020, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X