For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ షేర్లు భద్రం! డీమాట్ ఖాతాదారులకు ఎన్ఎస్ఈ మార్గదర్శకాలు

|

మీకు డీమాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్నాయా? స్టాక్ మార్కెట్‌లో షేర్లకు సంబంధించిన లావాదేవీలు చేస్తూ ఉంటారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ తన ఖాతాదారుల షేర్లను వారికి తెలియకుండానే బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వైనం వెలుగులోకి రావడంతో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) అప్రమత్తమైంది.

మదుపరులు ఏం చేయాలో, ఏం చేయకూడదో, తమ డీమాట్, ట్రేడింగ్ ఖాతాలను ఎలా నిర్వహించుకోవాలో, షేర్లను ఎలా భద్రపరచుకోవాలో తెలుపుతూ ఈ అంశంపై పలు సూచనలు జారీ చేసింది.

NSE has issued an advisory to all investors on keeping their stocks and investments safe

ఇవీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

- షేర్లు కొనే సమయంలో నగదు చెల్లించిన తరువాత మీ ఖాతాలోకి ఒక్క రోజులోపే ఆ షేర్లు బదిలీ అయ్యాయో లేదో సరిచూసుకోవాలి.

- రోజూ మీ డీమాట్ ఖాతాలోకి లాగిన్ అయి బ్యాలెన్స్, డీమాట్ స్టేట్‌మెంట్‌ను సరిచూసుకుంటూ ఉండాలి.

- ఎక్స్ఛేంజ్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను గమనిస్తూ ఉండాలి. సెక్యూరిటీ లెక్కల్లో ఏమైనా తేడాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత సంస్థలకు వెల్లడించాలి.

- మీరు ఉపయోగించని నిధులు, షేర్లను స్టాక్ బ్రోకర్ వద్ద ఉంచొద్దు. ఒకవేళ ట్రేడింగ్ చేస్తే.. ఆ తరువాత 24 గంటల్లోపు కాంట్రాక్ట్ నోట్‌లను ధ్రువీకరించుకోవాలి. మీ స్టాక్ బ్రోకర్ల నుంచి కనీసం 3 నెలలకు ఒకసారి స్టేట్‌మెంట్ తీసుకోవాలి.

- పవర్ ఆఫ్ అటార్నీ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నిర్దేశాల ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీ తప్పనిసరి ఏమీ కాదు. కాబట్టి ఒకవేళ మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా.. మీ స్టాక్ బ్రోకర్ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? ఎంత సమయం వరకు అతడికి ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుందనేది చాలా స్పష్టంగా పేర్కొనాలి.

- పవర్ ఆఫ్ అటార్నీకి ప్రత్యామ్నాయంగా.. స్పీడ్ ఈ, ఎసిస్ట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్లను నమోదు చేసుకుంటే సెక్యూరిటీలను ఆన్‌లైన్ డెలివరీ పొందవచ్చు.

- మిమ్మల్ని సంప్రదించే చిరునామాలు, ఫోన్ నంబర్లను ఎల్లప్పుడూ మీ స్టాక్ బ్రోకర్ వద్ద ఉంచాలి. మీకెప్పుడైనా సందేశాలు, ఈ-మెయిల్స్ రాకపోతే ఆ విషయాన్ని మీ స్టాక్ బ్రోకర్ దృష్టికి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి.

- మీ డీమాట్ ఖాతాలో ఏ లోపం ఉన్నా మీరు మొదట దాని గురించి మీ స్టాక్ బ్రోకర్‌కు వెల్లడించాలి. అక్కడ్నించి మీకు సరైన స్పందన రాని పక్షంలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీ సంస్థలకు ఫిర్యాదు చేయాలి.

English summary

మీ షేర్లు భద్రం! డీమాట్ ఖాతాదారులకు ఎన్ఎస్ఈ మార్గదర్శకాలు | NSE has issued an advisory to all investors on keeping their stocks and investments safe

After the Karvy Stock Broking scandal, the National Stock Exchange (NSE) has issued an advisory to all investors on keeping their stocks and investments safe. This comes after Karvy was found indulging in misappropriation of client funds.
Story first published: Friday, December 6, 2019, 21:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X