For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగవేతదారుగా అనుగ్రాహ్ స్టాక్ బ్రోకింగ్, ప్రకటించిన ఎన్ఎస్ఈ

|

ముంబై: అనుగ్రాహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) ఎగవేతదారుగా ప్రకటించింది. ఆ సంస్థకు ట్రేడింగ్ హక్కులను కూడా రద్దు చేసింది. దీంతో పాటు బ్రోకరేజీ హౌస్ మెంబర్‌షిప్‌ను కూడా తొలగించింది. ఎన్ఎస్ఈ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మెంబర్‌షిప్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే మరో బ్రోకింగ్ సంస్థ పైన అలాంటి చర్యలు తీసుకోవడం గమనార్హం.

ఈ మేరకు ఎన్ఎస్ఈ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు ఎక్స్చేంజీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఎన్ఎస్ఈఐఎల్ నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్ 26వ తేదీన మార్కెట్ ముగిసిన తర్వాత నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇటీవల కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సభ్యత్వాన్ని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తొలగించాయి.

పన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టంపన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టం

 NSE declares Anugrah Stock & Broking as defaulter, scraps membership

అనుగ్రాహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ కార్యకలాపాలపై నవంబర్ 13వ తేదీన సెబి సస్బెన్షన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత విచారణలో అవకతవకలు కనిపించడంతో చర్యలు తీసుకుంది.

English summary

ఎగవేతదారుగా అనుగ్రాహ్ స్టాక్ బ్రోకింగ్, ప్రకటించిన ఎన్ఎస్ఈ | NSE declares Anugrah Stock & Broking as defaulter, scraps membership

The National Stock Exchange of India (NSE) has expelled Anugrah Stock & Broking from the exchange after declaring it a defaulter.
Story first published: Friday, November 27, 2020, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X